Nail Biting Effects: గోళ్లు కొరికే అలవాటు ఉందా.. ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా..!

Nail Biting Effects: గోళ్లు కొరకడం చాలా చెడ్డ అలవాటు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉంటుంది.

Update: 2024-05-10 15:30 GMT

Nail Biting Effects: గోళ్లు కొరికే అలవాటు ఉందా.. ఎన్ని అనర్థాలు జరుగుతాయో తెలుసా..!

Nail Biting Effects: గోళ్లు కొరకడం చాలా చెడ్డ అలవాటు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉంటుంది. మనకు తెలియకుండానే మన చేతి వేళ్లు నోటిలోకి వెళ్లిపోతాయి. ఏదైనా విషయం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే టెన్షన్‌తో ఎక్కువగా గోళ్లు కొరుకుతుంటారు. దీనివల్ల మీకు తెలియకుండానే అనారోగ్య సమస్యల బారినపడుతారు. ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచంలో ని దాదాపు 30 శాతం మందికి గోళ్లు కొరికే అలవాటు ఉందట. దీనివల్ల ఎలాంటి అనర్థాలు జరుగు తాయో ఈ రోజు తెలుసుకుందాం.

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం

గోళ్లు కొరకడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా నోటిలోకి ప్రవేశిస్తుంది. ఇది పరోనిచియా అనే బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్‌ ను పెంచుతుంది. ఇది క్రమంగా శరీరంలోకి చేరి రకరకాల ఆరోగ్య సమస్యలను సృషిస్తుంది. గోళ్లు కొరకడం వల్ల గాయాలై చీము ఏర్పడి మంటగా ఉంటుంది. సకాలంలో వైద్యం చేయించకుంటే జ్వరం, శరీర నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.

గోళ్ల పెరుగుదల తగ్గిపోతుంది

గోళ్లను పదే పదే కొరకడం, నమిలే అలవాటు ఉంటే అది గోళ్ల సాధారణ పెరుగుదలను ఆపుతుం ది. పదే పదే గోళ్లు కొరకడం వల్ల గోరు కణజాలం దెబ్బతింటుంది. ఇది గోర్లు పెరగకుండా చేస్తుంది. గోళ్లు కొరకడం వల్ల కడుపులో మురికి పేరుకుపోతుంది. జీర్ణవ్యవస్థ, జీవక్రియలో తీవ్రమైన నష్టం జరుగుతుంది. దీంతో వాంతులు, విరేచనాలు, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఫంగల్ ఇన్ఫెక్షన్‌

గోరు కొరికే సమయంలో పేరుకుపోయిన ఫంగస్ నోటి ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు చేరు తుంది. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ కు దారి తీస్తుంది. ఇది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. గోళ్లు నమలడం లేదా కొరకడం వల్ల దంతాలు బలహీనపడతాయి. ఇది చిగుళ్లలో రక్తస్రావం లేదా పంటి నొప్పికి కారణమవుతుంది. కాబట్టి గోళ్లు కొరకడం మానడం ఉత్తమం.

Tags:    

Similar News