Government Pension Schemes: ఇవి ప్రభుత్వ వృద్ధాప్య పెన్షన్‌ పథకాలు.. వీటి ప్రయోజనం ఎలా పొందాలో తెలుసుకోండి..!

Government Pension Schemes: పనిచేసే ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్‌ ప్లాన్‌ చేసుకోవాలి. లేదంటే వృద్ధాప్యంలో ఆర్థికంగా చాలా ఇబ్బందిపడుతారు.

Update: 2024-05-10 13:30 GMT

Government Pension Schemes: ఇవి ప్రభుత్వ వృద్ధాప్య పెన్షన్‌ పథకాలు.. వీటి ప్రయోజనం ఎలా పొందాలో తెలుసుకోండి..!

Government Pension Schemes: పనిచేసే ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్‌ ప్లాన్‌ చేసుకోవాలి. లేదంటే వృద్ధాప్యంలో ఆర్థికంగా చాలా ఇబ్బందిపడుతారు. ఎవరో ఒకరిపై ఆధారపడి బతకాల్సిన పరిస్థి తులు నెలకొంటాయి. ప్రతి వ్యక్తి తను ఉద్యోగంలో లేదా ఏదైనా పనిలో చేరగానే రిటైర్మెంట్‌ గురించి ఆలోచించాలి. ప్రభుత్వం కూడా ప్రజల కోసం చాలా వృద్ధాప్య పెన్షన్‌ పథకాలను ప్రవేశపెట్టింది. వీటిలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల రిటైర్మెంట్‌ తర్వాత మీకు పెన్షన్‌ లభిస్తుంది. వీటిలో కొన్నింటిలో గ్యారంటీ పెన్షన్‌ అమలు చేస్తున్నారు. ఈ రోజు వృద్ధాప్య పెన్షన్‌ స్కీంల గురించి తెలుసుకుందాం.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన రిటైర్మెంట్‌ ప్లాన్‌. దీని కింద నెలకు కొంత మొత్తం ఇన్వెస్ట్‌ చేస్తూ ఉండాలి. వారి వయస్సు పెరిగే కొద్దీ పౌరులకు భద్రత లభిస్తుంది. ఇందులో చేసే పెట్టుబడి సురక్షితమైనది. దీనిని PFRDA పర్యవేక్షిస్తుంది. 60 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా NPS లో చేరవచ్చు. అలాగే అతను 70 సంవత్సరాల వయస్సు వరకు సభ్యుడిగా ఉండవచ్చు. NPSలో పెట్టుబడి పెట్టడం వల్ల వృద్ధాప్యంలో పెన్షన్‌ లభిస్తుంది. మీ జీవితానికి భరోసా కల్పిస్తుంది.

సీనియర్ సిటిజన్ల కోసం ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం (IGNOAPS) నెలవారీ పెన్షన్ కూడా అందుబాటులో ఉంది. BPL కేటగిరీలో ఉన్న 60 నంచి 79 సంవత్సరాల వయస్సు గల సీనియర్ సిటిజన్లకు నెలవారీ రూ. 300/- స్టైఫండ్ లభిస్తుంది. ఎవరైనా 80 ఏళ్లు నిండితే వారికి నెలకు 500 రూపాయలకు పెరుగుతుంది. ఈ పెన్షన్ స్కీమ్ కోసం ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు.

అటల్ పెన్షన్ యోజన (APY) పేదలు, బలహీనవర్గాలు, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రారంభించారు. APY కింద పెట్టుబడిదారునికి కనీస నెలవారీ పెన్షన్ పొందాలనే నిబంధన ఉంది. ఇందులో పెన్షన్ మొత్తం నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు ఉంటుంది. అలాగే మీరు 18 నుంచి 40 సంవత్సరాల వయస్సులోపు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అర్హులు కాదని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News