Fake Paneer: నకిలీ పన్నీర్‌ను ఎలా గుర్తుపట్టాలి?

Identify Original Paneer: ఈ రోజుల్లో ఆహార పదార్థాలను మొత్తం కల్తీ చేస్తున్నారు.

Update: 2024-05-10 13:00 GMT

Identify Original Paneer: నిజమైన పన్నీర్‌.. నకిలీ పన్నీర్‌ని ఎలా గుర్తుపట్టాలి..!

Identify Original Paneer: ఈ రోజుల్లో ఆహార పదార్థాలను మొత్తం కల్తీ చేస్తున్నారు. అక్రమ సం పాదనకు ఆశపడి కొంతమంది వ్యాపారులు అసలుకు బదులుగా నకిలీ పదార్థాలను తయారు చేస్తున్నారు. నిత్యావసరాలైన కారం, ఉప్పు, పసుపు, బియ్యం మాత్రమే కాకుండా పన్నీర్‌ లాంటి పదార్థాలను నకిలీవి తయారుచేసి జనాల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారు. మీరు తినే పన్నీర్‌ నిజమైనదేనా అని ఎప్పుడైనా ఆలోచించారా.. మార్కెట్‌లో పన్నీరు కల్తీ అధికంగా జరుగుతుం ది. ఈ రోజు నిజమైన పన్నీర్, నకిలీ పన్నీరుకు తేడా తెలుసుకుందాం.

పాల పదార్థాల్లో చాలా వరకు నకిలీవి రాజ్యమేలుతున్నాయి. అందులో పన్నీర్ తొలి స్థానంలో ఉంది. దీనితో చాలా రకాల వంటకాలు చేయవచ్చు. కేవలం మూడు చిట్కాల ద్వారా పన్నీరు నకిలీదా, నిజమైనదా తెలుసుకోవచ్చు. ఒరిజినల్ పన్నీర్ వాసన చూస్తే మంచి పాల వాసన వస్తుంది. కొద్దిగా తుంచి రుచి చూస్తే పాల రుచి కనిపిస్తుంది. డూప్లికేట్ అయితే రబ్బర్ లాగా సాగుతూ ఉంటుంది. దీంతో పాటు పనీర్‌ కొద్దిగా ఒక పాత్రలోకి తీసుకుని నీరు పోసి వేడి చేసి అందులో నాలుగైదు చుక్కల అయోడిన్‌ వేయాలి. పనీర్‌ నీలం రంగులోకి మారితే అది కల్తీ అని అర్థం. అసలైన పనీర్‌ అయితే రంగు మారదు.

పన్నీర్‌ని నీటిలో ఉడికించిన తర్వాత చల్లటి నీటిలో వేయాలి. అదే నీటిలో కందిపప్పు పది గింజలు వేయాలి. పది నిమిషాల సేపు కదిలించకుండా ఉంచాలి. నీరు లేత ఎరుపు రంగులోకి మారితే ఆ పనీర్‌ కల్తీ అని అర్థం. రంగు మారకపోతే నిర్భయంగా ఆ పనీర్‌ను వాడుకోవచ్చు. అలాగే పాలతో చేసిన పనీర్‌ అయినప్పటికీ పుల్లటి వాసన వస్తున్నా, రుచిలో ఏదైనా తేడా కనిపించినా దాని జోలికి వెళ్లకపోవడమే మంచిది. 

Tags:    

Similar News