ఈరోజు (మే-20-బుధవారం) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-05-20 01:13 GMT
Live Updates - Page 3
2020-05-20 03:40 GMT

విశాఖకు చేరిన వందే భారత్ 2 విమానాలు

* భారత ప్రభుత్వ వందే భారత్-2 లో భాగంగా అబుదాబి నుంచి విశాఖ విమానాశ్రయానికి విమానం చేరింది.

* రాత్రి అబుదాబి నుంచి 148 మంది ప్రయాణికులు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు.

* ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు 13 జిల్లాలకు చెందిన ప్రవాసాంధ్రులు, విద్యార్థులు ఉన్నారు.

* ప్రయాణీకులకు ఎయిర్ పోర్ట్ లో కోవిడ్ పరీక్షలు, ఇమిగ్రేషన్, ఇతర పరీక్షలు, తరవాత ఎయిర్ పోర్ట్ వెలుపలికి పంపనున్నట్లు ఎయిర్ పోర్ట్ అథారిటీ తెలిపింది.

* వారి సొంత జిల్లాలకు దింపడానికి సిద్ధంగా ఉంచిన 13 బస్లు, ఎస్కార్ట్ సిబ్బంది ప్రభుత్వ అధికారులు సిద్ధం చేశారు.

* మనిలా నుంచి విశాఖ చేరుకోనున్న మరో విమానం.

* మనీలా (ఫిలిప్పీన్స్) నుండి విశాఖపట్నం ఎయిరిండియా ప్రత్యేక విమానంలో చేరుకున్న 166 మంది తెలుగువారు.

* వచ్చిన వారిలో ఎనిమిది మంది విశాఖ వారు మిగతా 158 మంది ఏపీలో ఇతర జిల్లా వారు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.




2020-05-20 02:18 GMT

రెండో అతిపెద్ద 'సూపర్‌ సైక్లోన్‌'గా అంపన్

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అంపన్‌ తుపాను తీవ్రత కొనసాగుతుంది. దీని ప్రభవంతో సముద్ర తీరం అల్లకల్లోలంగా తయారైంది. పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చింది. కాగా.. అంపన్‌ తుపాను ఉత్తరాంధ్రలో కాస్త ప్రభావం చూపింది.

-మరిన్ని వివరాలు 


2020-05-20 01:40 GMT

విశాఖ డాక్టర్ ను హైకోర్టులో హాజరు పరచానున్న పోలీసులు

- నేడు విశాఖ డాక్టర్ సుధాకర్ ను హైకోర్టులో హాజరపరచనున్న విశాఖ పోలీసులు

- సుధాకర్ పట్ల పోలీసులు, ప్రభుత్వం అనుచితంగా ప్రవర్తించిందని హైకోర్టుకి ఫిర్యాదు చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత

- అనిత ఫిర్యాదు సుమోటోగా స్వీకరించిన హైకోర్టు 

- సుధాకర్ ను నేడు కోర్టులో హాజరు పరచాలన్న హైకోర్టు

2020-05-20 01:37 GMT

ఏపీ సరిహద్దుల వద్ద అక్రమ మద్యం పట్టివేత

కృష్ణాజిల్లా విస్సన్నపేట మండలం వేమిరెడ్డిపల్లి లో భారీగా మద్యం పట్టివేత..

- తెలంగాణ నుండి అక్రమంగా ఆంధ్రా లోకి తరలిస్తూ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ 300 మద్యం బాటిళ్లతో పట్టుబడిన వైనం.

- మాటు వేసి మద్యం అక్రమ రవాణా ను అడ్డుకున్న ముగ్గురు స్టేషన్ సిబ్బందికి రివార్డులను అందజేసిన-ఏఎస్పీ..

- నూజివీడు డిఎస్పీ బి.శ్రీనివాసులు, ఇన్ఛార్జ్ సిఐ పి.శ్రీను,విస్సన్నపేట ఎస్సై లక్ష్మణ్ లను అభినందించిన-ఏఎస్పీ వకుల్ జిందాల్..

Tags:    

Similar News