Ambati Rambabu: ఏపీలో హింసాత్మక ఘటనల వెనుక చంద్రబాబు ఉన్నారు
Ambati Rambabu: కొందరు పోలీసులు టీడీపీ నాయకుల డబ్బుకు లొంగిపోయారు
Ambati Rambabu: ఏపీలో హింసాత్మక ఘటనల వెనుక చంద్రబాబు ఉన్నారు
Ambati Rambabu: ఏపీలోని పల్నాడులో పోలింగ్ రోజున, తరువాత జరిగిన అల్లర్ల వెనుక చంద్రబాబు ఉన్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. హింసాత్మక ఘటనలపై విచారణ జరుపుతున్న సిట్ బృందాన్ని కలిసి పలు అంశాలను వివరించి ప్రతిపక్ష నాయకులు, పోలీసుల తీరుపై ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున బందోబస్తులో పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోతున్నామని తెలిసే చంద్రబాబు హింసను ప్రోత్సహించారని ఆరోపించారు. దాడుల వెనుక చంద్రబాబు, పవన్, పురందేశ్వరి కుట్రలు చేశారనే అనుమానాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సత్తెనపల్లి నుంచి మూడుసార్లు పోటీ చేశానని, ఇలాంటి హింసాత్మక ఘటనలు ఏనాడు చోటుచేసుకోలేదని అన్నారు. పోలింగ్, పోలీసు సిబ్బంది కొంతమంది టీడీపీ నాయకులకు డబ్బులకు లొంగిపోయారని ఆరోపించారు.