రెండో అతిపెద్ద 'సూపర్‌ సైక్లోన్‌'గా ఉంఫాన్ .. నేడు బెంగాల్‌లో తీరం దాటే ఆవకాశం

రెండో అతిపెద్ద సూపర్‌ సైక్లోన్‌గా ఉంఫాన్ .. నేడు బెంగాల్‌లో తీరం దాటే ఆవకాశం
x
Highlights

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అంపన్‌ తుపాను తీవ్రత కొనసాగుతుంది. దీని ప్రభవంతో సముద్ర తీరం అల్లకల్లోలంగా తయారైంది.

పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఉంఫాన్ తుపాను తీవ్రత కొనసాగుతుంది. దీని ప్రభవంతో సముద్ర తీరం అల్లకల్లోలంగా తయారైంది. పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు వచ్చింది. కాగా.. ఉంఫాన్ తుపాను ఉత్తరాంధ్రలో కాస్త ప్రభావం చూపింది. శ్రీకాకుళం జిల్లా తీరప్రాంత మండలాల్లో గాలుల ఉధృతి ఎక్కువగా ఉంది. సముద్రంలో అలల తీవ్రత పెరిగింది. గొట్టాబ్యారేజీ వద్ద గర్భంలో ఉన్న నీటిని 7 గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు విడిచిపెట్టారు. సోంపేటలోని బారువతీరంతో పాటు పలుచోట్ల సముద్రం 300 అడుగుల ముందుకు వచ్చింది. హిరమండలంలోని వంశధారలో వరదనీటి ప్రవాహం పెరిగింది.

మంగళవారం సాయంత్రానికి ఉంఫాన్ తుపాన్ ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణంగా 360 కిలోమీటర్లు, పశ్చిమబెంగాల్‌లోని డిగాకు దక్షిణ నైరుతి దిశగా 510 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఉత్తర ఈశాన్యదిశగా వాయవ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి ఉత్తర బెంగాల్‌-బంగ్లాదేశ్‌ తీరాల మధ్య డిగా, హతియా దీవుల మధ్య సుందర్‌బన్‌కు... దగ్గర్లో బుధవారం తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెళ్లాడించింది.

ఈ పెనుతుపాను ఉంఫాన్ బుధవారం తీరం దాటే ముందు ఆంధ్రప్రదేశ్‌, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

గంటకు 210-240 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలోని సముద్ర తీరం వెంబడి గంటకు 55-65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు ఈ నెల 20 వరకు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం సూచించింది. రెండు దశాబ్దాల్లో బంగాళాఖాతంలో ఏర్పడిన రెండో అతిపెద్ద 'సూపర్‌ సైక్లోన్‌'గా అంపన్‌ను నిపుణులు అభివర్ణిస్తున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories