చిత్రపరిశ్రమకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. షూటింగ్‌లకు అనుమతి

చిత్రపరిశ్రమకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. షూటింగ్‌లకు అనుమతి
x
Representational Image
Highlights

కరోనా దెబ్బకు అన్ని రంగాలు అతలాకుతలం అయ్యాయి. సినీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది.

కరోనా దెబ్బకు అన్ని రంగాలు అతలాకుతలం అయ్యాయి. సినీ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. షూటింగులు లేక సినీ కార్మికులు అంతా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో సినిమా, టీవీ రంగాల షూటింగ్ ప్రక్రియను సులభతరం చేయాలని నిర్ణయించింది. దీంతోపాటు సింగిల్ విండో సిస్టం ఏర్పాటు చేసింది. నిర్మాణ సంస్థలను ప్రోత్సహించేందుకు సినీ, టెలివిజన్ రంగాలకు ఉచితంగా షూటింగ్‌లకు అనుమతినిచ్చింది.

కరోనా దెబ్బకు ఆగిన షూటింగ్‌లకు అనుమతి దక్కడంతో ప్రేక్షకుల ఎంతగానో అభూమానించే సీరియల్స్, టీవీ షోలు ముందుకు రానున్నాయి.రాష్ట్రంలో మరిన్ని ప్రాంతాల్లో షూటింగ్‌కి అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

మూడు కేటగిరీలుగా విభజించారు.

కేటగిరి 1: రోజుకు నగదు డిపాజిట్ 15 వేల రూపాయలు నిర్ణయించింది. రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థ ఆధీనంలో ఉన్న పార్కుల్లో, పట్టణాభివృద్ధి సంస్థ పార్కులు, మునిసిపల్ కార్పొరేషన్ అధీనంలో ఉన్న పార్కుల్లో షూటింగ్‌కు అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని వివిధ మ్యూజియం... బిల్డింగ్‌లు, పాఠశాలలు మరియు కాలేజీలలోనూ షూటింగ్ చేసుకోవచ్చు.

కేటగిరి 2 : రోజుకు కాషన్ డిపాజిట్ 10 వేల రూపాయలు నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ఆలయాలు, విశాఖపట్నం, తిరుపతి జూ పార్కులు, ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఉన్న సరస్సులు, ఉద్యానవనాలు, జిల్లా కేంద్రాల్లోని పాఠశాలలు, కాలేజీలు.., విజయవాడలోని స్టేట్ సెంట్రల్ లైబ్రరీలలో షూటింగ్‌లకు అనుమతి.

కేటగిరి 3 : రోజుకు కాషన్ డిపాజిట్ ఐదు వేల నిర్ణయించారు. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని రోడ్లు, పార్కులు, బీచ్‌లు, అలిపిరి గార్డెన్స్‌తో సహా, అన్ని పార్కుల్లో షూటింగ్ అనుమతి ఇచ్చింది.

ఏపీటిడిసి,ఆర్&బీ, ఇరిగేషన్ శాఖల లొకేషన్స్‌లో షూటింగ్‌కి అనుమతి ఇస్తూ... రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories