ప్రపంచవ్యాప్తంగా 30 లక్షలు దాటిన కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది.

Update: 2020-04-28 02:06 GMT
Representational Image

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 30 లక్షలు దాటింది. సోమవారం కొత్తగా 65,819 కేసులు నమోదు కావడంతో.. మొత్తం కేసుల సంఖ్య 30,59,081కి చేరింది. ఈ మహమ్మారి బారినపడి 4,287 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 2,11,202కి చేరింది. అయితే గత నాలుగు వారాలుగా మృతుల సంఖ్య 5వేలకు పైనే ఉంది. ఈ వారం మృతుల సంఖ్య మాత్రం 4వేల దగ్గర్లో ఉంటుండటం ఒకింత ఉపశమనం అనుకోవచ్చు.

అలాగే అమెరికాలో మృతులు, కొత్త కేసుల సంఖ్య కాస్త తగ్గుతుంటే ఇతర దేశాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 9,19,745 మంది కోలుకోవడం వల్ల 19,28,133 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. వీటిలో 56,281 కేసుల్లో పేషెంట్లు ICUలో ఉన్నారు. కాగా.. ఆదివారంతో పోల్చితే ఈ కేసుల సంఖ్య దాదాపు వెయ్యి దాకా తగ్గిందల కనిపించింది. ఇది కూడా మంచి శుభసూచికమే. అమెరికాలో సోమవారం 20,883 పాజిటివ్ కేసులు నమోదయాయి. మొత్తం కేసుల సంఖ్య 10,08,042కి చేరింది. అలాగే సోమవారం 1,236 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 56649కి చేరింది. ఓవరాల్‌గా చూస్తే మూడ్రోజులుగా అమెరికా కొద్దిగా కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయితే అమెరికాలో కరోనా తగ్గుముఖం అయిపోతున్నట్లే అనుకోవడానికి వీల్లేదనుకోవచ్చు. ఇక స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, బ్రెజిల్, కెనడా, ఇండియా, బ్రిటన్, టర్కీ, ఇరాన్, రష్యా, పెరు, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి.

కరోనా రష్యాపై విరుచుకుపడుతోంది. గత ఐదు రోజులుగా రష్యాలో 3వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 6,198 కేసులొచ్చాయి. ఫలితంగా మొత్తం కేసులు 87,147కి చేరాయి. అలాగే సోమవారం 47 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 794కి చేరింది. ఇండియాలో కరోనా రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా కేసుల సంఖ్య చూస్తే 28,380కి చేరగా.. వాటిలో 6,362 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. కరోనా బారినపడి 886 మంది మరణించారు.


Tags:    

Similar News