ప్రభుత్వ షట్‌డౌన్‌ను ముగించే ఫండింగ్ బిల్‌కు వైట్‌హౌస్ ఆమోదం
ప్రభుత్వ షట్‌డౌన్‌ను ముగించే దిశగా అమెరికా అడుగులు వేసింది. ఈ మేరకు ప్రభుత్వ షట్‌డౌన్‌ను ముగించే ఫండింగ్ బిల్‌కు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది.
ప్రభుత్వ షట్‌డౌన్‌ను ముగించే ఫండింగ్ బిల్‌కు వైట్‌హౌస్ ఆమోదం
ప్రభుత్వ షట్‌డౌన్‌ను ముగించే దిశగా అమెరికా అడుగులు వేసింది. ఈ మేరకు ప్రభుత్వ షట్‌డౌన్‌ను ముగించే ఫండింగ్ బిల్‌కు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. అమెరికా కాంగ్రెస్‌లో బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా.. 222 మంది సభ్యులు ప్రభుత్వ షట్‌డౌన్ ముగింపునకు సానుకూలంగా ఓట్లు వేశారు.
మరో 209 మంది సభ్యులు షట్‌డౌన్ ముగింపును వ్యతిరేకిస్తూ ఓట్లు వేశారు. 222 - 209 ఓట్ల తేడాతో అమెరికా కాంగ్రెస్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే...అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. డెమొక్రటిక్ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు బిల్లుకు మద్దతుగా ఓటు వేశారు.
ప్రస్తుతం ఆ బిల్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దగ్గరకు వెళ్లింది. ఈ రోజు రాత్రి 9.45 గంటలకు ఆయన ఆ బిల్లుపై సంతకం చేయనున్నారు. అధ్యక్షుడి సంతకంతో బిల్లు అమల్లోకి రానుంది. 43 రోజుల పాటు సుధీర్ఘంగా కొనసాగిన ప్రభుత్వ షట్‌డౌన్‌కు తెరపడనుంది. ఇక, ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా అమెరికా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారు.