Zelenskyy: ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయ్‌

Zelenskyy: ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-09-25 07:29 GMT

Zelenskyy: ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో మానవ చరిత్రలోనే అత్యంత విధ్వంసకరమైన ఆయుధ పోటీ నెలకొందన్నారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో ఆయన మాట్లాడారు.

రష్యాకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. ఐరాస సహా ఇతర బలహీన అంతర్జాతీయ సంస్థలు ఉక్రెయిన్‌, గాజా, సుడాన్‌లో యుద్ధాలను నిలువరించలేకపోయాయని ఎండగట్టారు. ఎవరు ప్రాణాలతో ఉండాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రపంచంలో ఆయుధాలు మాత్రమే ఉంటాయని... ఎలాంటి భద్రతా హామీలు ఉండవన్నారు. మాపై యుద్ధాన్ని రష్యా పొడిగిస్తూనే ఉంది. దానిని అంతర్జాతీయ సమాజం ఖండించాలని ఆయన ప్రస్తావించారు.

Tags:    

Similar News