ఆకాశంలో కనిపించిన వేలాడే దీపాలు... ఏలియన్స్ పనేనా?

జపాన్ టోటోరి పట్టణంలో ఆకాశంలో ఓ అద్బుతం కనిపించింది.

Update: 2024-05-22 13:25 GMT

ఆకాశంలో కనిపించిన వేలాడే దీపాలు... ఏలియన్స్ పనేనా?

జపాన్ టోటోరి పట్టణంలో ఆకాశంలో ఓ అద్బుతం కనిపించింది. ఆకాశంలో పొడవుగా వేలాడుతున్న కాంతి రేఖలు చూసి ప్రజలు నివ్వెరపోయారు. ఈ దృశ్యం ఈ నెల 11న కనిపించింది. తాము మొత్తంగా 9 కాంతి స్తంభాలను చూశామని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.తొలుత టోటోరిలో ఆ తర్వాత డైసెన్ తీరప్రాంతంలో కూడా ఇదే తరహాలో ఆకాశంలో తొమ్మిది కాంతి స్తంబాలు కన్పించాయి.

ఈ నెల 11న మాషి అనే సోషల్ మీడియా యూజర్ ఇందుకు సంబంధించిన పోస్టును ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ పోస్టు నెట్టింట వైరలైంది. పోస్టు కొద్ది గంటల్లోనే 12 మిలియన్ల మంది చూశారు. పలువురు ఈ ట్వీట్ పై స్పందించారు.

ఆకాశంలో అసాధారణంగా కన్పించిన ఈ దృశ్యాలను చూసి ఏలియన్లు భూమిపై ల్యాండయ్యాయనే ప్రచారం కూడ ప్రారంభమైంది. సోషల్ మీడియాలో ఈ చర్చ జోరుగా సాగింది. ఈ కాంతి వెనుక అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. జపాన్ లోని మత్స్యకారులు సాధారణంగా చేపలను ఉపరితలానికి ఆకర్షించడానికి "ఇసరిబి కొచ్చు" ( చేపలను ఆకర్షించేందుకు ఉపయోగించే ) అనే లైట్లను పడవలలో ఉపయోగిస్తారని ...వాటి వల్లే ఆకాశంలో తొమ్మిది కాంతి స్తంభాలు ఏర్పడినట్టుగా సన్నీస్కైజ్ అనే పత్రిక కథనం తెలిపింది.

రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగినంతగా పడిపోయినప్పుడు, ఓడలపైన వాతావరణంలో మంచు స్ఫటికాలు ఏర్పడతాయి. ఈ స్ఫటికాలు తగినంత పెద్దవిగా వర్షపాతం లేకుండా ఉన్నప్పుడు మత్స్యకారుల పడవల నుండి వచ్చే కాంతిని ప్రతిబింబిస్తాయి. దీంతో ప్రకాశవంతమైన నిలువు కాంతి స్తంభాల శ్రేణిని ఒడ్డు నుండి చూడవచ్చు. మీడియాలో కథనాల వేలాడే దీపాల వెనుక ఉన్న రహస్యం తెలిసిపోయింది. దాంతో, ఇది ఏలియన్స్ పనే అనే అపోహలు కూడా తొలగిపోయాయి.

అయితే, ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారీ ఏలియన్స్ పట్ల మానవాళికి ఉన్న ఆసక్తి వెల్లడవుతోంది. గ్రహాంతరవాసులు ఉండే అవకాశం ఉందనే వాదనలు ఇప్పటికీ బలంగా వినిపిస్తూనే ఉన్నాయి. వాటి గురించి మనిషి అన్వేషణ మాత్రం కొనసాగుతూనే ఉంటుంది.

Tags:    

Similar News