US Immigration Policy Impact: అమెరికాకు విదేశీ విద్యార్థులు 19% డౌన్..!
అమెరికాకు తగ్గిన విదేశీ విద్యార్ధుల సంఖ్య ఆగస్టులో ఉన్నతవిద్య కోసం అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల.. సంఖ్య భారీగా తగ్గిందన్న ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 19 శాతం..
US Immigration Policy Impact: అమెరికాకు విదేశీ విద్యార్థులు 19% డౌన్..!
కరోనా మహమ్మారి తర్వాత ఇదే రికార్డు స్థాయి తగ్గుదల కావడం గమనార్హం. ఇక భారతీయ విద్యార్థుల విషయానికొస్తే 44 శాతం మేర క్షీణత కనిపించింది. సాధారణంగా యూఎస్ విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యే ఆగస్టులో అమెరికా 3లక్షల13వేల138 విద్యార్థి వీసాలు జారీ చేసింది. గత ఏడాది ఇదే సమయానికి అగ్ర దేశానికి వెళ్లిన విద్యార్థుల సంఖ్యలో భారత్ ముందంజలో ఉండగా, ఈసారి ఆ సంఖ్య భారీగా తగ్గింది. మరోవైపు.. చైనా విద్యార్థులకు యూఎస్ 86వేల647 వీసాలు జారీ చేసింది. భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య కంటే ఇది రెట్టింపు కావడం గమనార్హం.