జపాన్ తూర్పు తీరంలో భారీ భూకంపం

జపాన్ తూర్పు తీరంలో సోమవారం తెల్లవారుజామున 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

Update: 2020-04-20 09:52 GMT

జపాన్ తూర్పు తీరంలో సోమవారం తెల్లవారుజామున 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.అయితే సునామీ హెచ్చరిక జారీ కాలేదని స్పష్టం చేసింది. మియాగి ప్రిఫెక్చర్ తీరానికి 50 కిలోమీటర్ల పసిఫిక్ సముద్రగర్భం క్రింద 41.7 కిలోమీటర్ల లోతులో భూకంపం యొక్క కేంద్రం ఉందని యుఎస్‌జిఎస్ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

జపాన్ వాతావరణ సంస్థ (జెఎంఎ) భూకంపం 6.1 తీవ్రతతో, సుమారు 50 కిలోమీటర్ల లోతులో, ఉదయం 5.30 గంటలకు సంభవించిందని.. ప్రకంపనల తర్వాత సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని జపాన్ క్యోడో న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అయితే ఎటువంటి ప్రాణనష్టం కూడా జరగలేదని సదరు ఏజన్సీ పేర్కొంది.

వాస్తవానికి 2011 లో, మియాగి ప్రిఫెక్చర్‌కు తూర్పున సుమారు 130 కిలోమీటర్ల దూరంలో 9.0 తీవ్రతతో సంభవించిన భూకంపం, అప్పట్లో భారీ సునామికి కారణమైంది.. ఫుకుషిమాలో అణు రియాక్టర్ ధ్వంసం అవ్వడానికి కారణమైంది.. అంతేకాదు అప్పట్లో దాదాపు 16,000 మంది మరణించారు.


Tags:    

Similar News