దటీజ్ ఉక్రెయిన్.. ఆయుధాలను వదిలేసి పారిపోతున్న రష్యా సేనలు..

Russia Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

Update: 2022-09-12 13:45 GMT

దటీజ్ ఉక్రెయిన్.. ఆయుధాలను వదిలేసి పారిపోతున్న రష్యా సేనలు..

Russia Ukraine War: ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఖర్కివ్‌లో పెద్ద నగరాలైన కుపియాన్స్‌, ఇజియిమ్ నుంచి రష్యా సేనలు పారిపోతున్నాయి. యుద్ధ ట్యాంకులు, ఆయుధాలను వదిలేసి మరీ రష్యా దళాలు గ్రామాలను, నగరాలను ఖాళీ చేస్తున్నాయి. ఈ విషయాన్ని మాస్కో కూడా అధికారికంగా అంగీకరించడం విశేషం. తిరిగి దాడి చేయడానికే వ్యూహాత్మకంగా ఉపసంహరించుకుంటున్నామని రష్యా ప్రతినిధులు చెప్తున్నారు. యుద్ధం ప్రారంభంలోనే రాజధాని కీవ్‌ను ఆక్రమించాలన్న మాస్కో ప్రణాళికను భగ్నంచేసిన ఉక్రెయిన్ తాజా విజయాలు యుద్ధం దిశను మారుస్తాయన్న ఆశాభావంతో ఉంది. దాదాపు 2వేల చదరపు కిలోమీటర్ల భూ భాగాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని రష్యా దళాలు వెన్ను చూపుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ తెలిపారు.

Tags:    

Similar News