క్రమంగా కోలుకుంటోన్న UK ప్రధాన మంత్రి

UK ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఇంటెన్సివ్ కేర్‌లో ఉండి క్రమంగా కోలుకుంటున్నారు.

Update: 2020-04-09 09:04 GMT
Boris Johnson (File Photo)

UK ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ఇంటెన్సివ్ కేర్‌లో ఉండి క్రమంగా కోలుకుంటున్నారు.. ప్రస్తుతం ఆయన COVID-19 తో పోరాడుతున్నారు.. 55 ఏళ్ల జాన్సన్ ఆదివారం సాయంత్రం అధిక ఉష్ణోగ్రత మరియు దగ్గుతో సెయింట్ థామస్ ఆసుపత్రిలో చేరారు.. అయితే ఆరోగ్యం విషమించడంతో సోమవారం ఇంటెన్సివ్ కేర్ కు తరలించి చికిత్స చేస్తున్నారు. ఆయన ఆక్సిజన్ ను వెంటిలేటర్ ద్వారా కాకుండా సాధారణంగానే తీసుకుంటున్నారు.

అలాగే ప్రధాని ఆరోగ్యం మరింత పెరుగుపడుతోందని.. వైద్యసిబ్బందితో కూర్చొని మాట్లాడుతున్నారని మంత్రి ఆలివర్ డౌడెన్ గురువారం అన్నారు. COVID-19 ద్వారా UK లో ఆసుపత్రిలో సంభవించిన మరణాలు ఏప్రిల్ 7 నాటికి రోజువారీ నమోదు 938 పెరిగి మొత్తం 7,097 కు చేరుకున్నాయని ఆరోగ్య అధికారులు బుధవారం తెలిపారు. ఇదిలావుంటే పాజిటివ్ కేసులు ప్రస్తుతం 60,733 కు చేరుకున్నాయి. అలాగే కోలుకున్న వారి సంఖ్య కేవలం 135 మాత్రమే ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండగా UK లో మాత్రం అతితక్కువగా ఉంది.

Tags:    

Similar News