జార్జియాలో కుప్పకూలిన సైనిక రవాణా విమానం
జార్జియాలో తుర్కియేకు చెందిన సైనిక రవాణా విమానం కూలిపోయింది. ఘటనలో 20 మంది సిబ్బంది మృతిచెందారు.
జార్జియాలో కుప్పకూలిన సైనిక రవాణా విమానం
జార్జియాలో తుర్కియేకు చెందిన సైనిక రవాణా విమానం కూలిపోయింది. ఘటనలో 20 మంది సిబ్బంది మృతిచెందారు. అజర్ బైజాన్ నుంచి తుర్కియే వెళ్తుండగా.. మార్గమధ్యంలో విమానం ప్రమాదానికి గురైంది. జార్జియా అంతర్గత వ్యవహారాల శాఖతో పాటు తుర్కియే రక్షణ శాఖ దీన్ని ధ్రువీకరించాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించాయి. కూలిన సమయంలో విమానంలో సిబ్బందితో సహా 20 మంది ప్రయాణిస్తున్నారు.