కరోనా ఎఫెక్ట్ : పదివేల మంది ఖైదీల విడుదలకు మార్గం సుగమం

టర్కీలో రద్దీగా ఉండే జైళ్లలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తక్షణం పదివేల మంది ఖైదీలను విడుదల చేయాలనీ టర్కీ పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించింది.

Update: 2020-04-16 02:34 GMT

టర్కీలో రద్దీగా ఉండే జైళ్లలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తక్షణం పదివేల మంది ఖైదీలను విడుదల చేయాలనీ టర్కీ పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించింది. అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ప్రవేశపెట్టిన బిల్లుకు, ఎకె పార్టీ, జాతీయవాద ఎంహెచ్‌పి మిత్రపక్షాలు మద్దతు ఇచ్చాయని, మొత్తం 279 ఓట్లకు, 51 ఓట్లకు వ్యతిరేకంగా పడ్డాయని.. మెజారిటీ అనుకూలంగా రావడంతో ఈ బిల్లు ఆమోదించబడిందని డిప్యూటీ పార్లమెంట్ స్పీకర్ సురేయ సాది బిల్జిక్ అన్నారు.

కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సుమారు 45,000 మంది ఖైదీలను తాత్కాలికంగా విడుదల చేయడానికి ఈ చట్టం ఉపయోగపడుతుంది. అర్హత ఉన్నవారు మే నెల చివరి వరకు న్యాయ నియంత్రణలో విడుదల అవుతారు. న్యాయ మంత్రిత్వ శాఖ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది.

అయితే 2016 లో "ఉగ్రవాద" ఆరోపణలపై జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని మినహాయించడాన్ని ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి, ఇందులో జర్నలిస్టులు , రాజకీయ నాయకులు 2016 లో తిరుగుబాటు ప్రయత్నం తరువాత అణచివేతకు గురయ్యారు.


Tags:    

Similar News