Trump Zelensky Meeting Florida: జెన్ స్కీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమావేశం.. ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై ట్రంప్ కీలక ప్రకటన

Trump Zelensky Meeting Florida: అమోరికా ఫ్లోరిడాలోని ట్రంప్ తన నివాసంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో భేటీ అయ్యారు.

Update: 2025-12-29 06:35 GMT

Trump Zelensky Meeting Florida: అమోరికా ఫ్లోరిడాలోని ట్రంప్ తన నివాసంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీతో భేటీ అయ్యారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే దిశగా త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. మేం చాలా బాగా చర్చించుకున్నాం, దాదాపు అన్ని అంశాలపై మాట్లాడుకున్నాం, ఇరు పక్షాలు శాంతికి ఎంతో దగ్గరగా ఉన్నాయని ట్రంప్ తెలిపారు. యుద్ధం ముగియాలని అందరూ కోరుకుంటున్నారని అన్నారు. ప్రస్తుతం తూర్పు డాన్‌బాస్ ప్రాంతంలో సైనిక రహిత జోన్‌ను ఏర్పాటు చేయాలన్నది తాజా ప్రణాళిక. అయితే, డాన్‌బాస్ ప్రాంత భవిష్యత్తుపైనే ప్రధానంగా ప్రతిష్ఠంభన కొనసాగుతోందని, అయినా త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ప్రణాళికకు 90 శాతం అంగీకారం కుదిరిందని జెలెన్ స్కీ తెలిపారు. భూభాగాల విషయంలో ఉక్రెయిన్ ప్రజల అభిప్రాయం మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన సంకేతం ఇచ్చారు. అయితే, ఈ చర్చలపై రష్యా మాత్రం భిన్నంగా స్పందించింది. డాన్‌బాస్ నుంచి ఉక్రెయిన్ దళాలు వెంటనే వైదొలగాలని డిమాండ్ చేసింది. శాంతికి యూరప్ దేశాలే అడ్డంకిగా ఉన్నాయని ఆరోపించింది. శాంతియుతంగా సమస్య పరిష్కారం కాకపోతే, సైనిక చర్య ద్వారానే ముందుకు వెళ‌తామ‌ని పుతిన్ ఇటీవల హెచ్చరించారు. 

Tags:    

Similar News