Trump on Heaven: ఉక్రెయిన్-రష్యా శాంతి ఒప్పందం కుదిరితే స్వర్గానికే..! ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశం
డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్-రష్యా శాంతి ఒప్పందంపై ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఈ ఒప్పందం తనను స్వర్గానికి తీసుకెళ్లవచ్చని చెప్పారు. వైట్ హౌస్ స్పందించగా, ఆయన ఆధ్యాత్మిక కోణంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Trump on Heaven: ఉక్రెయిన్-రష్యా శాంతి ఒప్పందం కుదిరితే స్వర్గానికే..! ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ తన వ్యాఖ్యలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి శాంతి ఒప్పందం కుదిరితే అది తనను ‘స్వర్గానికి తీసుకెళ్తుంది’ అని ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ, “ప్రస్తుతం ఆ అవకాశం తక్కువగానే ఉంది. కానీ శాంతి ఒప్పందం జరిగితే, అది నన్ను స్వర్గానికి చేరే మార్గంలో ఒక గొప్ప అడుగుగా నిలుస్తుంది” అని అన్నారు.
Nobel Peace Prize ఆశలు..!
ట్రంప్ గతంలో కూడా యుద్ధం ముగింపుపై పలుమార్లు వ్యాఖ్యానించారు. ఆయన ప్రయత్నాలు Nobel Peace Prize గెలవడానికే అన్న విమర్శలు వచ్చినా, ఈసారి ఆయన వాఖ్యలు ఆధ్యాత్మిక కోణంలో ఉండడం విశేషం. మాస్కో-కీవ్ శాంతిచర్చలకు మధ్యవర్తిత్వం చేస్తున్న ట్రంప్.. రెండు దేశాధ్యక్షులతో పాటు యూరోపియన్ నాయకులతోనూ చర్చలు జరిపారు.
“స్వర్గానికి దారి ఇదే..”
ఆ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. “నా జీవితం కోసం మాత్రమే ఈ ప్రయత్నాలు కావు. ఒకవేళ ఇవి సక్సెస్ అయితే, నేను స్వర్గానికి వెళ్లాలనుకుంటున్నా. నేను మంచి పనులు చేయడం లేదని అంటున్నారు. కానీ, శాంతి ఒప్పందం జరిగితే అది నాకు దోహదం చేస్తుంది” అని పేర్కొన్నారు.
ఆధ్యాత్మికత వైపు ట్రంప్
కొన్నేళ్లుగా ట్రంప్‌పై అనేక విమర్శలు, కోర్టు కేసులు, అభియోగాలు నమోదయ్యాయి. గతేడాది హత్యాయత్నం నుంచి బయటపడ్డ తర్వాత ఆయనలో ఆధ్యాత్మికత పెరిగినట్లు కనిపిస్తోంది. “నన్ను దేవుడే కాపాడాడు, అమెరికాను మళ్లీ గొప్పగా నిలబెడతాడు” అని పలు సందర్భాల్లో చెప్పిన ఆయన, వైట్‌హౌస్‌లో కూడా spiritual programs నిర్వహిస్తున్నారు. అంతేకాదు, ఒక ఆధ్యాత్మిక గురువుని సలహాదారుగా నియమించుకోవడం విశేషం.
వైట్‌హౌస్ స్పందన
ట్రంప్ తాజా వ్యాఖ్యలపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పందిస్తూ.. “ప్రెసిడెంట్ చెప్పిన మాటలు సరదాగా కావు, ఆయన నిజంగానే స్వర్గానికి వెళ్లాలని కోరుకుంటున్నారు. మనమందరం కూడా అదే కోరుకుంటున్నాం” అని అన్నారు.
ఈ వ్యాఖ్యలతో ట్రంప్ మరోసారి అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యారు.