Donald Trump: వైట్‌హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై కాల్పులు.. ఈ ఘటనను ఉగ్రదాడిగా వర్ణించిన ట్రంప్

Donald Trump: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

Update: 2025-11-27 06:09 GMT

Donald Trump: వైట్‌హౌస్ సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై కాల్పులు.. ఈ ఘటనను ఉగ్రదాడిగా వర్ణించిన ట్రంప్

Donald Trump: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు సమీపంలో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులపై జరిగిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు.

ఈ ఘటనపై స్పందించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇది ఒక "హేయమైన చర్య" అని, దీనిని "ఉగ్రవాద దాడి"గా అభివర్ణించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇలాంటి చర్యలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

పరిస్థితి తీవ్రత దృష్ట్యా, అధ్యక్షుడు ట్రంప్ తక్షణమే భద్రతను కట్టుదిట్టం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. వాషింగ్టన్ డి.సి.లో భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడానికి అదనంగా 500 మంది సైనికులను రాజధానికి పంపాలని ఆయన పెంటగాన్‌ను ఆదేశించారు.

Tags:    

Similar News