Kenya Plane Crash: నేలకూలిన విమానం.. 12 మంది మృతి
Kenya Plane Crash: కెన్యాలో ఘోర ప్రమాదం జరిగింది. క్వాలే కౌంటీ ప్రాంతంలో విమానం నేలకూలింది.
Kenya Plane Crash: కెన్యాలో ఘోర ప్రమాదం జరిగింది. క్వాలే కౌంటీ ప్రాంతంలో విమానం నేలకూలింది. దియానీ నుంచి కిచ్వాకు టూరిస్టులను తీసుకెళ్తుండగా విమానం కుప్పకూలింది. పడిపోయిన వెంటనే మంటల్లో దగ్ధమైంది. విమానంలో ప్రయాణిస్తున్న 12 మంది అగ్నికి ఆహుతయ్యారు. ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు.. విజిబులిటీ లేకపోవడమే ప్రమాదానికి కారణమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.