మండిపోతున్న పాకిస్తాన్

Pakistan: పాకిస్తాన్ సింధ్ దక్షిణ ప్రావిన్స్ లో మే 28న అత్యధికంగా 52 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది.

Update: 2024-05-29 06:30 GMT

పాకిస్తాన్ లో 52 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్: అల్లాడుతున్న జనం..

Pakistan: పాకిస్తాన్ సింధ్ దక్షిణ ప్రావిన్స్ లో మే 28న అత్యధికంగా 52 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదైంది. ఈ వేసవిలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రతగా వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. అధిక ఉష్ణోగ్రత,వడగాలులతో పాకిస్తాన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆసియాలో విపరీతమైన వాతావరణ మార్పులకు మానవ తప్పిదాలే కారణమని శాస్త్రవేత్తల బృందం అభిప్రాయపడుతుంది.

వాతావరణ మార్పుల ప్రభావానికి గురయ్యే దేశాల్లో పాకిస్తాన్ ఐదో స్థానంలో ఉంది. అయితే అతివృష్టి లేదా అనావృష్టి సంభవిస్తాయని వాతావరణ శాఖాధికారులు గుర్తు చేస్తున్నారు. 2017లో పాకిస్తాన్ లోని నైరుతి ప్రావిన్స్ బలూచిస్తాన్ లోని తుర్బత్ లో 54 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసియాలో ఇది రెండవ అత్యధిక ఉష్ణోగ్రతగా గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలో నాలుగో అత్యధిక ఉష్ణోగ్రతగా వాతావరణశాఖాధికారులు తెలిపారు.

అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యుత్ కూ డిమాండ్ పెరిగింది. ఈ డిమాండ్ కు తగినట్టుగా విద్యుత్ సరఫరా కూడా లేదు. దీంతో దేశ వ్యాప్తంగా పలు చోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఫలితంగా పలు చోట్ల ప్రజలు నిరసనకు దిగుతున్నారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News