Storm Dennis: యూకేను అతలాకుతలం చేసిన శీతాకాల తుఫాను..

Update: 2020-02-19 04:10 GMT

యూకేలో వరద బీభత్సం సృష్టిస్తోంది. గత మూడు రోజులుగా డెన్నిస్, ద్వీపాలపై తీవ్ర తుఫాను ప్రభావం చూపుతూ ఉంది. మంగళవారం స్కాట్లాండ్ ,ఇంగ్లాండ్ దేశ వాతావరణ కార్యాలయాలు ఆరు తీవ్రమైన వరద హెచ్చరికలు జారీ చేశాయి. శీతాకాల తుఫాను ఇప్పటికే మధ్య ఇంగ్లాండ్ మరియు వేల్స్ అంతటా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఇప్పటివరకూ మొత్తం 200 హెచ్చరికలు యుకె అంతటా జారీ అయ్యాయి.

తీవ్ర తుఫాను ముగిసినప్పటికీ.. వర్షాలు మాత్రం తగ్గుముఖం పట్టలేదు.. ఈ వారమంతా వర్షాలు కొనసాగుతాయని భావిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. "200 సంవత్సరాలలో ఇవి అత్యంత ఘోరమైన వరదలు" అని డైలీ మెయిల్ పేర్కొంది. నివేదికల ప్రకారం వేల్స్ లో సుమారు 800 గృహాలు వరదలతో ప్రత్యక్షంగా ప్రభావితమయ్యాయి.

ఆదివారం యుకె లో రికార్డు స్థాయిలో 600 హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. అయితే సౌత్ వేల్స్ మరియు పశ్చిమ ఇంగ్లాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వరద ప్రభావం ఎక్కువగా లేదు. మరోవైపు ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ ఇంగ్లాండ్ కు చెందిన 599 భవనాలు వరదల్లో చిక్కుకున్నాయి. భారీ వర్షాల కారణంగా వేల్స్ మరియు వాయువ్య ఇంగ్లాండ్‌లో ఎల్లో వాతావరణ హెచ్చరికను జారీ చేశారు.

ముఖ్యంగా తుఫానుకు దెబ్బతిన్న 800 గృహాలకు 10 మిలియన్ల వరకు పరిహారం ప్రకటించింది వేల్స్ ప్రభుత్వం. వేల్స్ అంతటా ఎనిమిది నదులలోనీటి మట్టాలు రికార్డు ఎత్తుకు చేరుకున్నాయి. లగ్, సెవెర్న్ మరియు వై నదులకు తీవ్ర వరద హెచ్చరికలు జారీ చేశారు.

వరదల నేపథ్యంలో 200 హెచ్చరికల్లో 10 తీవ్రమైన వరద హెచ్చరికలు. 180 కి పైగా అతి తీవ్రమైన వరద హెచ్చరికలు ఉన్నాయి. బుధ, గురువారాల్లో వర్షపాతం మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

దీంతో నదుల పక్కన నివసిస్తున్న గిరిజనులు , సాధారణ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇప్పటికే 200 కు పైగా సురక్షిత కేంద్రాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలాగే తుఫాను పర్యవసానాలను ఎదుర్కోవటానికి యుకె అంతటా 1,000 మందికి పైగా రెస్క్యూ సిబ్బందిని నియమించారు. 

Tags:    

Similar News