స్పెయిన్ లో తగ్గిన కరోనా వ్యాప్తి.. కారణం ఇదే..

Update: 2020-04-10 11:07 GMT

స్పెయిన్ లో కరోనావైరస్ ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుతోంది.. 17 రోజుల అనంతరం శుక్రవారం అత్యల్ప మరణాల సంఖ్యను నమోదు చేసింది, తాజాగా కోవిడ్ కారణంగా 605 మంది మరణించారని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. దీంతో స్పెయిన్లో మొత్తం మరణాల సంఖ్య 15,843 కు పెరిగింది, అలాగే దేశవ్యాప్తంగా మొత్తం ధృవీకరించబడిన కేసుల సంఖ్య ఇప్పుడు 157,022 గా ఉంది. మార్చి 25 నుండి మరణాల రేటు నాలుగు శాతానికి తగ్గుముఖం పట్టింది.

మార్చి 25 న ఇది 27 శాతానికి పైగా ఉంది. సంక్రమణ రేటు కూడా మందగించింది, గత 24 గంటల్లో 4,576 కొత్త కేసులు ఉండగా, వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 55,688 ఘననీయంగా పెరిగింది. మహమ్మారిని అరికట్టేందుకు మార్చి 14 న అమల్లోకి వచ్చిన జాతీయ లాక్‌డౌన్‌ ను ప్రజలు కూడా పర్ఫెక్ట్ పాటించడంతో వ్యాప్తి తగ్గుముఖం పట్టిందని వైద్య నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ జాగ్రత్త మొదట్లో ఉన్నట్టయితే ఇంత పెద్ద నష్టం జరిగేది కాదని అభిప్రాయపడుతున్నారు.  

Tags:    

Similar News