who is Shivon Zilis: మస్క్, మోదీ భేటీలో ఈ లేడీ ఎవరు? ఆమెకు అక్కడికి ఎంట్రీ ఎలా వచ్చింది?

who is Shivon Zilis : ఎవరీ శివోన్ జిలిస్? శివోన్ జిలిస్ వయస్సు 39 ఏళ్లు. ఆమె కెనడాలో పుట్టారు. యేల్ యూనివర్శిటీలో చదువుకున్నారు. తల్లి పేరు ఎన్ శారద. ఆమె భారతీయురాలు. తండ్రి రిచర్డ్ జిలిస్. ఆయన కెనడా దేశస్థుడు.

Update: 2025-02-14 13:36 GMT

who is Shivon Zilis: ఎలాన్ మస్క్, మోదీ సమావేశంలో ఈ లేడీ ఎవరు? ఆమెకు ఇండియాతో ఏం సంబంధం?

who is Shivon Zilis, what is her relationship with musk and connection with india : ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఈ భేటీలో మస్క్, మోదీ మాత్రమే కాకుండా మరో మహిళ కూడా కనిపించారు.

సాధారణంగా ఒక దేశాధినేతతో జరిగే భేటీలో ఇతరులకు ప్రవేశం ఉండదు. అది కనీస ప్రోటోకాల్. కానీ ఈ మహిళ మాత్రం ముగ్గురు పిల్లలతో సహా వెళ్లి అక్కడ సందడి చేశారు. దీంతో వరల్డ్ మీడియాలో ఇదొక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. ఇండియన్స్ కూడా ఆమె ఎవరా అని తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆమె పేరు శివోన్ జిలిస్.

Full View

ఎవరీ శివోన్ జిలిస్?

శివోన్ జిలిస్ వయస్సు 39 ఏళ్లు. ఆమె కెనడాలో పుట్టారు. యేల్ యూనివర్శిటీలో చదువుకున్నారు. తల్లి పేరు ఎన్ శారద. ఆమె భారతీయురాలు. తండ్రి రిచర్డ్ జిలిస్. ఆయన కెనడా దేశస్థుడు. శివోన్ జిలిస్ ఎలాన్ మస్క్ ఆలోచనల్లోంచి పుట్టిన న్యూరాలింక్ అనే స్టార్టప్ కంపెనీలో ఉన్నత హోదాలో పనిచేస్తున్నారు.

ఆమె కేవలం మస్క్ కంపెనీలో ఉద్యోగి మాత్రమే కాదు... ఎలాన్ మస్క్ ప్రస్తుత జీవిత భాగస్వామి కూడా. కాకపోతే ఇప్పటివరకు ఆ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించలేదు. మస్క్, శివోన్ జిలిస్ ఇద్దరి ప్రేమకు గుర్తుగా ముగ్గురు సంతానం ఉన్నారు. అజ్యూర్, స్ట్రైడర్ ఇద్దరూ కవలలు. గతేడాదే ఈ ఇద్దరికీ మూడో సంతానం కలిగింది.

ప్రధాని మోదీతో భేటీకి మస్క్ పార్ట్‌నర్ జిలిస్ తన ముగ్గురు పిల్లలతో కలిసి వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం వారి రాక గురించి ముందస్తు సమాచారం ఉంటుంది కాబట్టి కాబోలు... ప్రధాని మోదీ కూడా వారికి మూడు పుస్తకాలు బహుమతిగా అందించారు. నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్ర నాథ్ ఠాగూర్ రచించిన ది క్రీసెంట్ మూన్, ఆర్.కే. నారాయణ్ కలెక్షన్, పండిట్ విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథల పుస్తకాలను వారికి గిఫ్ట్‌గా ఇచ్చారు.

ప్రధాని మోదీ కూడా మస్క్ పిల్లలతో కలిసి తీసుకున్న ఫోటోలు, తను ఇచ్చిన పుస్తకాలను వారు తిప్పేస్తోన్న ఫోటోలను ఎక్స్ ద్వారా షేర్ చేసుకున్నారు. అంతరిక్షం, ఆటోమొబైల్, సాంకేతిక పరిజ్ఞానం, కొత్త కొత్త ఆవిష్కరణలు వంటి అంశాలు మోదీ, మస్క్ భేటీలో చర్చకొచ్చాయి.

ఇక శివోన్ జిలిస్ కెరీర్ విషయానికొస్తే... 2017 నుండి 2019 వరకు టెస్లా కంపెనీలో ప్రాజెక్ట్ డైరెక్టర్‌‌గా పనిచేశారు. శామ్ ఆల్ట్‌మన్ సీఈఓగా ఉన్న ఆర్టిషిఫియల్ ఇంటెలీజెన్స్ స్టార్టప్ కంపెనీ ఓపెన్ఏఐకి సలహాదారుగా సేవలు అందించారు. బ్లూమ్‌బర్గ్ బెటా ఇన్వెస్ట్‌మెంట్ టీమ్ వ్యవస్థాపక సభ్యురాలిగా ఉన్నారు. ఆ సంస్థ స్థాపించినప్పటి నుండి 9 రకాల పెట్టుడులను ఆమె ముందుండి నడిపించారు.

2015 లో 30 ఏళ్లలోపు 30 మంది పెట్టుబడిదారుల పేరుతో ఫోర్బ్స్ ప్రకటించిన జాబితాలో జిలిస్ చోటు దక్కించుకున్నారు. 35 ఏళ్లలోపు 35 మంది పేరుతో లింక్డ్‌ఇన్ ప్రకటించిన మరో జాబితాలోనూ జిలిస్ ఉన్నారు.

జిలిస్ ప్రస్తుతం మస్క్‌తోనే కలిసి ఉంటున్నప్పటికీ ఆమె మీడియా ముందుకు రావడానికి పెద్దగా ఇష్టపడరు. గత 6 నెలల్లో ఆమె మస్క్‌తో కలిసి కనిపించడం ఇది రెండోసారి. గతేడాది నవంబర్‌లో డోనల్డ్ ట్రంప్ తన మార్-ఏ-లాగో ఎస్టేట్‌లో ఇచ్చిన విందులో మస్క్‌తో కలిసి వచ్చారు. కానీ అప్పుడు కూడా ఆమె మస్క్ వెనుకే ఉండిపోయారు.

మస్క్‌తో మోదీ స్నేహం

ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు మంచి స్నేహితుడు మాత్రమే కాదు... ప్రస్తుతం ట్రంప్ సర్కారులోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. అమెరికా ప్రభుత్వ సామర్థ్యం, పనితీరును పరిశీలించే విభాగాన్ని మస్క్ ముందుండి నడిపిస్తున్నారు. మస్క్, మోదీ భేటీ అవడం ఇదేం తొలిసారి కాదు. 2015 లో మోదీ అమెరికాలో పర్యటించారు. అప్పుడు మస్క్ ఆయన్ను శాన్ జోస్‌లోని టెస్లా కార్ల కంపెనీ తయారీ పరిశ్రమకు తీసుకెళ్లారు. టెస్లా పరిశ్రమను మోదీకి మొత్తం తిప్పి చూపించారు.

మస్క్ అమెరికా ప్రభుత్వ ప్రతినిధి మాత్రమే కాకుండా పెద్ద వ్యాపారవేత్త కావడంతో ఈ ఇద్దరి భేటీకి భారీ ప్రాధాన్యత కనిపించింది. అయితే, ఇదే విషయమై మోదీతో ఎలాన్ మస్క్ భేటీ గురించి స్పందించాల్సిందిగా అమెరికన్ మీడియా ట్రంప్‌ను కోరింది.

అందుకు ట్రంప్ స్పందిస్తూ మస్క్‌కు ఇండియాలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఏమైనా ఉందేమో అన్నట్లుగా అనుమానం వ్యక్తంచేశారు. అంతేకాదు... కానీ భారత్‌లో వ్యాపారం చేయడం చాలా కష్టం అని కూడా అనేశారు. ఇండియాలో ట్యాక్సులు ఎక్కువగా వేస్తారంటూ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అభిప్రాయాన్ని చెప్పారు. అది కూడా మోదీ తనను కలవడానికి కొన్ని గంటల ముందే ట్రంప్ ఈ కామెంట్ చేయడం గమనార్హం.

Modi meets Donald Trump: మోదీ అమెరికా పర్యటన ఫలించిందా? భారత్‌ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గారా?

Full View

Tags:    

Similar News