Rolex Watch: అప్పడు రూ.7వేలు.. ఇప్పుడు రూ.41లక్షలు.. వేలంలో దుమ్మురేపిన రోలెక్స్ వాచ్..!
Rolex Watch: రోలెక్స్...వాచ్ బ్రాండ్లు ఎన్ని ఉన్నా రోలెక్స్ కు సాటి రావు..మిగతా బ్రాండ్లతో కంపేర్ చేస్తే వీటి ధర ఎక్కువ ఉన్నా సరే..కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
Rolex Watch: అప్పడు రూ.7వేలు.. ఇప్పుడు రూ.41లక్షలు.. వేలంలో దుమ్మురేపిన రోలెక్స్ వాచ్..!
Rolex Watch: రోలెక్స్...వాచ్ బ్రాండ్లు ఎన్ని ఉన్నా రోలెక్స్ కు సాటి రావు..మిగతా బ్రాండ్లతో కంపేర్ చేస్తే వీటి ధర ఎక్కువ ఉన్నా సరే..కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అంతెందుకు రోలెక్స్ బ్రాండ్ వాచీలను వారసత్వ ఆస్తిగా చూస్తారంటే అతిశయోక్తి కాదు...రోలెక్స్ వాచీలకు సంబంధించి ఒక నానుడి కూడా ఉంది. 20 అడుగుల దూరం నుంచి చూసినా..రోలెక్స్ వాచీని గుర్తు పట్టాలట..అలా గుర్తించినప్పుడే...కంపెనీ నుంచి రోలెక్స్ వాచ్ బయటకు రిలీజ్ చేస్తారట.
మేకింగ్, డిజైన్ విషయంలో తనదైన మార్క్ కారణంగానే రోలెక్స్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. డిమాండ్ మేరకు సప్లయ్ చేయడం కాదు..ఏడాదికి ఇన్ని యూనిట్లు రిలీజ్ చేయాలని ఒక లెక్క ఉంటుంది. అన్ని వాచీలను మాత్రమే రోలెక్స్ రిలీజ్ చేస్తుంది. అందుకే, రోలెక్స్ ను కొనుగోలు చేసేందుకు సంపన్న వర్గాలు ఆసక్తి చూపిస్తాయి. దీనిని ఒక స్టేటస్ సింబల్ గా భావిస్తాయి. తాజాగా రోలెక్స్ కంపెనీకి చెందిన ఓ వాచీని వేలం వేయగా రూ.41 లక్షలకు అమ్ముడుపోయింది.
60 ఏళ్ల క్రితం రాయల్ నేవీలో పనిచేస్తున్న సైమన్ బార్నెట్ ఓ డ్రైవర్...రోలెక్స్ సబ్ మారినర్ మోడల్ కు చెందిన వాచీని రూ.7000కు కొనుగోలు చేశాడు. ఈ మోడల్ ను ద డ్రైవర్స్ వాచీ అని కూడా వ్యవహరిస్తారు. సైమన్ బార్నెట్ 2019లో మరణించగా ఆయన కుమారుడు పీట్ బార్నెట్ తన తండ్రి వాచీని వేలం వేశాడు. ఈ వేలం పాటలో రూ.7000 ధర ఉన్న ఈ వాచీ రూ.41 లక్షలు పలికింది.