Zelenskyy: ట్రంప్‌ను రష్యా అధ్యక్షుడు తప్పుదోవ పట్టిస్తున్నారు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను తప్పుదోవ పట్టించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నిస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-09-16 09:53 GMT

Zelenskyy: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను తప్పుదోవ పట్టించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రయత్నిస్తున్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యలు చేశారు. కొత్త ఆంక్షలు విధించకుండా ఆలస్యం చేసేలా చేస్తున్నారన్నారు. ఆంక్షలను తప్పించుకునేందుకు పుతిన్ చేయాల్సిందంతా చేస్తున్నారన్నారు.

ఆంక్షలు విధించడాన్ని ఇలా వాయిదా వేస్తుంటే.. ఎలాంటి పరిస్థితికైనా సిద్ధమయ్యేందుకు రష్యాకు సమయం ఇచ్చినట్లు అవుతుందని పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు ఇప్పుడు కఠిన చర్యలు అవసరమని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. 

Tags:    

Similar News