కరోనావైరస్ ముందు ఏ ప్రేమైనా భారమే.. రోడ్లపైకి విసిరేస్తున్నారు..

కరోనావైరస్ అంటువ్యాధిపై తప్పుడు సమాచారంతో చైనాలోని యజమానులు తమ పెంపుడు జంతువులను బహుళ అంతస్తుల భవనాల నుండి విసిరివేస్తున్నట్లు తెలిసింది.

Update: 2020-02-02 06:33 GMT

కరోనావైరస్ అంటువ్యాధిపై తప్పుడు సమాచారంతో చైనాలోని యజమానులు తమ పెంపుడు జంతువులను బహుళ అంతస్తుల భవనాల నుండి విసిరివేస్తున్నట్లు తెలిసింది. టవర్ బ్లాకుల నుండి వీధుల్లోకి పిల్లులు మరియు కుక్కలను కనికరం లేకుండా విసిరిన అనేక చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

నివేదికల ప్రకారం, పెంపుడు జంతువులు ప్రాణాంతకమైన 2019-nCoV వైరస్ ను కలిగి ఉన్నాయనే పుకార్ల నేపథ్యంలో చైనాలోని రోడ్లమీద అనేక జంతువులను చంపి పడేస్తున్నారు. దీంతో రోడ్లపై ఎక్కడ చూసినా పెంపుడు జంతువుల శవాలు కనిపిస్తున్నాయి. వ్యాధి సోకిన వారి దగ్గరకు వెళ్లొచ్చిన జంతువులను క్యారంటైన్‌లో ఉంచాలని మాత్రమే వైద్యులు సూచించారు. అయితే ఇది సామాజిక మాధ్యమాల్లో మరో విధంగా ప్రచారం అయింది.. ఈ క్రమంలో పెంపుడు జంతువుల వల్ల ఈ వ్యాధి మనుషులకు వ్యాపిస్తుందని చైనీస్‌ భావిస్తున్నారు. దాంతో దయ లేకుండా జంతువుల ప్రాణాలు తీస్తున్నారు.

వైరస్ ఉద్భవించిన హుబే ప్రావిన్స్లోని టియాంజిన్ నగరంలోని హేవాన్ గుహో గార్డెన్ ప్రాంతంలో ఒక చిన్న ఫ్రెంచ్ బుల్డాగ్ మరణించింది. ఎంతో ముద్దుగా ఉండే ఆ డాగ్ మరణం జంతు ప్రేమికులను క్రుంగ దీసింది. ఆ డాగ్ చావుకు కారణం తెలుసుకొని నివ్వెరపోయారు. అది సాధారణ మరణం కాదని తెలుసుకొని ఆరా తీయగా.. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో టవర్ బ్లాక్ పై అంతస్తు నుండి భయాందోళనకు గురైన ఓ యజమాని.. ఆ కుక్కను నేలమీదకి విసిరి వేసిందని.. అది కారు మీద పడి తీవ్ర గాయాలతో మృతి చెందిందని. అది కిందపడిన సమయంలో టైర్ పేలుడులా శబ్దం సంభవించిందని జంతు ప్రేమికులకు స్థానికులు చెప్పారు.

వాస్తవానికి పిల్లులు, కుక్కలు వంటి పెంపుడు జంతువులు కరోనావైరస్ వ్యాప్తి జరుగుతుందని ధృవీకరించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం చెప్పింది. అంతేకాదు కరోనావైరస్ పై ఎమర్జెన్సీని ప్రకటించింది. మరోవైపు జంతువులను హత్య చేసిన యజమానులను పోలీసులు వెంటనే గుర్తించాలని చైనాకు చెందిన పెటా ఆసియా ప్రెస్ ఆఫీసర్ కీత్ గువో మీడియాతో అన్నారు. కరోనావైరస్, SARS, బర్డ్ ఫ్లూ మరియు మరెన్నో ప్రాణాంతక వ్యాధులకు బ్రీడింగ్ గ్రౌండ్‌ను అందించినందున, చైనాలోని జంతువుల మార్కెట్లు, కబేళాలు మరియు ఫ్యాక్టరీ పొలాలు వ్యక్తుల ఆరోగ్యానికి ముప్పు తెచ్చాయని ఆయన అన్నారు. 

Tags:    

Similar News