Pak-China: పాకిస్థాన్‌కు చైనా సపోర్ట్.. ఉగ్రవాదులకు అండదండలు అందిస్తున్న డ్రాగన్ కంట్రీ!
Pak-China: ధారణంగా హ్యాకింగ్‌కు ఉపయోగించే పద్ధతులు కూడా ఈ యాప్‌ల గోప్యతను ఛేదించలేవు. అంతే కాదు.. ఈ యాప్‌లు క్వాంటం కంప్యూటర్ లెవెల్‌కు కూడా చిక్కవట.
Pak-China: పాకిస్థాన్‌కు చైనా సపోర్ట్.. ఉగ్రవాదులకు అండదండలు అందిస్తున్న డ్రాగన్ కంట్రీ!
Pak-China: పహల్గాం పర్వతాల నడుమ.. ప్రకృతి మధురమైన బైసాసర్‌లో జరిగిన విషాద ఘటన వెనుక ఎవరున్నారు? ఈ దాడి చేసింది తామేనని ముందుగా ది రెసిస్టెన్స్ ఫోర్స్-TRF అనే ఉగ్రవాద గ్రూపు ముందుగా ప్రకటించుకున్నా.. తర్వాత మాత్రం మాట మార్చింది. అటు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈ ఉగ్రదాడిపై లోతుగా విచారణ జరుపుతున్నాయి. ముఖ్యంగా నేషనల్ ఇన్‌వెస్టిగేషన్ ఏజెన్సీ-NIA దర్యాప్తులో దూకుడు పెంచింది. ఘటన స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన NIAకి కీలక ఆధారాలు దొరికాయి. ముఖ్యంగా ఈ ఉగ్రదాడికి చైనా లింకులు బయటపడడం ప్రకంపనలు రేపుతోంది. ఇంతకీ ఏంటా చైనా లింకులు? ఉగ్రవాదులుకు చైనా సపోర్ట్ ఇచ్చిందా?
NIA నుంచి వస్తున్న సమాచారం ప్రకారం.. పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు చైనా సాంకేతిక సహాయాన్ని ఎక్కువగా వినియోగించారు.. దర్యాప్తులో భాగంగా, ఘటన ప్రాంతంలో ఒక చైనా శాటిలైట్ ఫోన్ ఉపయోగించినట్లు గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సాధారణ మొబైల్ నెట్‌వర్క్స్ కాకుండా, నేరుగా శాటిలైట్‌ను ఉపయోగించి కమ్యూనికేషన్ నిర్వహించడం ద్వారా వీళ్లంతా భారత భద్రతా వ్యవస్థను మోసం చేయగలిగారు. అంతేకాకుండా.. భారత్‌లో నిషేధంలో ఉన్న కొన్ని చైనా మొబైల్ యాప్‌లను కూడా ఉగ్రవాదులు తమ అంతర్గత సంభాషణలకు ఉపయోగించారన్న ఆధారాలు బయటపడుతున్నాయి. ఈ యాప్‌లు అత్యంత శక్తివంతమైనవి. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కలిగి ఉంటాయి. దీంతో సందేశాలు పంపిన వ్యక్తి, రిసీవ్ చేసుకున్న వ్యక్తి తప్ప మరెవ్వరూ ఆ సమాచారాన్ని చదవలేరు. సాధారణంగా హ్యాకింగ్‌కు ఉపయోగించే పద్ధతులు కూడా ఈ యాప్‌ల గోప్యతను ఛేదించలేవు. అంతే కాదు.. ఈ యాప్‌లు క్వాంటం కంప్యూటర్ లెవెల్‌కు కూడా చిక్కువట. ఇక సీక్రెసీని మరింత పెంచేందుకు స్టెగనోగ్రఫీ అనే ప్రత్యేక సాంకేతికతను ఉపయోగించారు. ఇక ఈ యాప్‌ల ప్రత్యేకత ఏంటంటే.. అవి తరచుగా తమ కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీని మార్చగలవు. దీంతో. దాడి చేసిన ఉగ్రవాదులు ఎలాంటి జాడ లేకుండా తమ సమాచారాన్ని పంచుకోగలిగారు.
ఇక చరిత్ర చూస్తే టెర్రరిస్ట్ గ్రూపులు టెక్నాలజీని తమ వ్యూహాలకు కీలక ఆయుధంగా మలచుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గత దశాబ్దంలో ఐసిస్ లాంటి ముఠాలు టెలిగ్రామ్ లాంటి సెక్యూర్ మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించాయి. అటు అల్ ఖైదా లాంటి సంస్థలు స్టెగనోగ్రఫీ ద్వారా తమ సంభాషణలను దాచేందుకు ప్రయత్నించాయి. ఇటు కొన్ని ఏళ్లుగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థలు చైనాలో తయారైన టెక్నాలజీలను ఎక్కువగా వినియోగిస్తున్నాయి. ప్రపంచ దేశాలకు చైనా తక్కువ ధరకే టెక్నాలజీని ఎగుమతి చేస్తుండటంతో అది ఉగ్రవాద ముఠాలకు సైతం సులభంగా అందుబాటులోకి వస్తోంది. శాటిలైట్ ఫోన్లు, ప్రైవెట్ యాప్‌లు, హ్యాకింగ్ గ్యాడ్జెట్లు లాంటివి చైనా నుంచి నేరుగా లేదా మూడో వ్యక్తుల ద్వారా ఉగ్రవాదులకు చేరుతున్నాయి. ఇక కశ్మీర్ పహల్గాం దాడిలో వెలుగు చూసిన చైనా శాటిలైట్ ఫోన్ వాడకం, నిషేధిత యాప్‌ల ద్వారా అంతర్గత సంభాషణలు చేసుకోవడం చూస్తుంటే ఈ విషయం క్లియర్‌కట్‌గా అర్థమవుతుంది. అటు పాకిస్థాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలకు మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోని ఉగ్ర శక్తులకు కూడా చైనా నుంచి సాంకేతిక మద్దతు అందుతున్నట్టు అనుమానాలు పుట్టుకుంటున్నాయి.