Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌కు బాంబులను సరఫరా చేస్తున్న పాకిస్థాన్

* ఆఫ్ఘనిస్తాన్‌కు బాంబులను సరఫరా చేస్తున్న పాకిస్థాన్ * కాబూల్‌ ఎయిర్‌పోర్టులో ఐసీస్-కే ఆత్మాహుతి దాడులు

Update: 2021-08-29 11:26 GMT

ఆఫ్గనిస్తాన్ ప్రజలు (ఇండియా టుడే )

Afghanistan: ఈ భూమండలంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా ఏదో ఒక రకంగా పాకిస్థాన్‌కు లింక్‌ ఉంటుంది. అభంశుభం తెలియని జనాల ప్రాణాలను తీయడం ఆ దేశానికి పైశాచిక ఆనందం. ఇందుకు అఫ్గానిస్థాన్‌లో జరిగిన ఉగ్రఘాతుక చర్య మరో సాక్ష్యంగా నిలుస్తుంది. ఇక్కడి ముష్కరులకు పాకిస్థాన్‌ నుంచే పేలుడు పదార్థాలు సమకూరాయని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా మరో ఉగ్రకుట్ర జరుగనుందని అమెరికా హెచ్చరిస్తోంది.

ఆఫ్ఘనిస్థాన్ ప్రజల ధీనస్థితి చూసి ప్రపంచ దేశాలు జాలి చూపిస్తున్నాయి. కానీ ఒక్క పాకిస్థాన్ మాత్రం బాంబులు సరఫరా చేస్తూ తన బుద్ధిని ప్రదర్శిస్తోంది. క్షణమొక నరకంలా బతుకున్న ఆఫ్ఘన్లపై మరింత క్రూరత్వాన్ని ప్రదర్శిస్తోంది పాకిస్థాన్. కాబుల్‌ ఎయిర్‌ పోర్టు సమీపంలో ఐసీస్-కే ఉగ్రవాద ముఠా ఆత్మాహుతి దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ముష్కర చర్యలో 169 మంది అఫ్ఘన్‌ ప్రజలు, 13 మంది అమెరికా సైనికులు బలయ్యారు.ఈ ఉగ్రదాడిలో 11 కేజీల ఆర్‌డీఎక్స్‌ను ఉపయోగించారు. బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్, హెల్మెట్‌ను కూడా తునతునకలు చేసే శక్తిమంతమైన పేలుడు పదార్థాలను వాడినట్లు తెలుస్తోంది. అయితే ఇవి పాక్‌ నుంచే ఉగ్రవాదులకు అందినట్లు తెలుస్తోంది.

పాకిస్థాన్‌లోని పెషావర్, క్వెట్టా నగరాల నుంచే ఐసీస్‌ కు బాంబుదాడులకు అవసరమైన సామగ్రి సరఫరా అవుతోంది. ఈ విషయం కాబుల్‌లోని ఆఫ్ఘన్ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ నివేదికలో వెల్లడైంది. ఐసిస్‌-కె ముఠా సభ్యుల్లో 90% మంది పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌కు చెందినవారేనని ఆ నివేదికలో తెలిపింది.మరో రెండు రోజుల్లో కాబుల్‌ విమానాశ్రయంపై మరో ఉగ్రదాడి జరిగే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు. సైనిక కమాండర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో ఎవరూ ఉండొద్దని అఫ్గాన్‌లో ఉన్న అమెరికా సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు అఫ్గాన్‌లో ఉన్న సైనికులను రక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బైడెన్ సైనిక ఉన్నతాధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News