ఇమ్రాన్ ​హ‌త్య‌కు కుట్ర? పోలీసుల హై అల‌ర్ట్.. 144 సెక్షన్ విధింపు​

Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ హత్యకు కుట్ర జరుగుతోందా?

Update: 2022-06-05 10:08 GMT

ఇమ్రాన్ ​హ‌త్య‌కు కుట్ర? పోలీసుల హై అల‌ర్ట్.. 144 సెక్షన్ విధింపు​

Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ హత్యకు కుట్ర జరుగుతోందా? అంటే అక్కడ పరిణామాలు చూస్తే అవుననే అన్పిస్తున్నాయ్.. ఇటీవలే దేశంలోని అన్ని పార్టీలు కలిసి ఇమ్రాన్‌ను పదవిలోంచి తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ను అంతం చేసేందుకు అక్కడ కుట్ర అంటూ ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పాక్ నిఘా సంస్థలు, ఐఎస్ఐ ప్రమేయం ఇమ్రాన్‌ను అంతమొందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారన్న చర్చ గత నెల రోజులుగా సాగుతోంది.

హెచ్చరికల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ భద్రతను కట్టుదిట్టం చేశారు అక్కడ పోలీసులు. ఇస్లామాబాద్ లోని ఇమ్రాన్ నివాస ప్రాంతం బెనిగలాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాజాగా 144వ సెక్షన్ సైతం విధించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ను అంతం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించాడు ఇమ్రాన్ ఖాన్ మేనల్లుడు హసన్ నియాజి. అంతకు ముందు ఇమ్రాన్ హత్యకు పాక్ నిఘా సంస్థలు ప్రయత్నిస్తున్నాయంటూ ఆరోపించారు పీటీఐ నేత ఫాహిద్ చౌదరి. దేశాన్ని అమ్మనందుకే ఇమ్రాన్ హత్య కుట్ర చేశారని పీటీఐ నేతలు ఆరోపిస్తున్నారు.

పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు ఏ ప్రధాని పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు. సైన్యం అండ ఉంటేనే ప్రధాని పదవిలో కొనసాగుతారన్న అభిప్రాయం ఉన్న నేపథ్యంలో తాజా హెచ్చరికలతో ఏం జరగబోతుందా అన్న చర్చ మొదలైంది. అవినీతి ఆరోపణలు, దేశానికి వ్యతిరేకమంటూ ఆరోపణలు గుప్పించి పదవిలోంచి దించేయడం పాకిస్తాన్ లో రివాజుగా మారింది. గతంలో ప్రధాని లియాఖత్ అలీఖాన్ హత్య ఆ తర్వాత జుల్ఫికర్ అలీ భుట్టోను ఉరిశిక్షతో అంతమొందించడం ప్రధాని రేసులో ఉన్న బెనజీర్ భుట్టోను చంపేయడం మనం చూశాం ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర అంటూ ఆందోళన కలిగించే అంశం తెరపైకి వచ్చింది. 

Tags:    

Similar News