భారత్‌తో 3 యుద్ధాల తర్వాత చాలా పాఠాలు నేర్చుకున్నాం.. మోడీతో నిజాయితీగా చర్చలు జరపాలన్న పాకిస్తాన్ ప్రధాని..

Pakistan: పాక్‌ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-01-17 08:57 GMT

Pakistan: పాక్‌ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ వంటి సమస్యలపై భారత ప్రధాని మోడీతో నిజాయితీగా చర్చలు జరపాలని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పిలుపునిచ్చారు. భారత్‌తో 3 యుద్ధాల తర్వాత పాక్‌ ఈ పాఠం నేర్చుకుందని చెప్పారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ భారత్‌తో సంబంధాలపై మాట్లాడారు. భారత్‌తో తాము శాంతినే కోరుకుంటున్నామన్న షరీఫ్.. కశ్మీర్‌లో జరుగుతున్నవాటిని ఆపాలంటూ భారత ప్రధాని మోడీని కోరారు.

కశ్మీర్ ప్రాంతంలో శాంతి స్థాపన చేయాలని తద్వారా రెండు దేశాలూ అభివృద్ధి చెందొచ్చని అభిప్రాయపడ్డారు. శాంతియుతంగా జీవిస్తూ పురోగతి చెందడమా లేక ఒకరికొకరు కలహ మాడుకుంటూ వనరులను వృథా చేసుకోవడమా అన్నది మన ఇష్టంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు.

భారత్‌తో మూడు యుద్ధాల్లో తలపడ్డాం. వాటి వల్ల కష్టాలు, పేదరికం, నిరుద్యోగం మిగిలాయి. భారత్‌తో 3 యుద్ధాలతో ఇప్పుడు తాము పాఠాలు నేర్చుకున్నామన్నారు. ఇప్పుడు శాంతియుతంగా జీవించాలని అనుకుంటున్నామని అన్నారు. రెండు దేశాలు అణ్వాయుధ సామర్థ్యం కలిగి ఉన్నాయని, ఒకవేళ దేవుడే కనుక యుద్ధానికి ఆదేశిస్తే అప్పుడు ఏం జరిగిందో చెప్పడానికి ఎవరు మిగిలి ఉంటారని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రశ్నించారు.


Tags:    

Similar News