Ishaq Dar: ఫేక్ వార్తను పార్లమెంట్‌లో చదివి.. నవ్వుల పాలైన పాక్‌ ఉప ప్రధాని..!

Ishaq Dar: పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ తాజాగా పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ విదేశీ మీడియా పాక్ ఎయిర్ ఫోర్స్‌ను ప్రశంసించింది అంటూ ఓ ఫేక్ వార్తను పార్లమెంట్‌లో చదివి వినిపించి గొప్పలు చెప్పుకున్నారు.

Update: 2025-05-16 12:03 GMT

Ishaq Dar: పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ తాజాగా పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ విదేశీ మీడియా పాక్ ఎయిర్ ఫోర్స్‌ను ప్రశంసించింది అంటూ ఓ ఫేక్ వార్తను పార్లమెంట్‌లో చదివి వినిపించి గొప్పలు చెప్పుకున్నారు. అయితే, ఈ వార్తపై పాక్ మీడియా సంస్థ ‘డాన్’ (Dawn News) నిర్వహించిన నిజనిర్ధారణలో, విదేశీ మీడియా అసలు ఎలాంటి ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ప్రశంసలు ఇవ్వలేదని వెల్లడించింది.

ఇషాక్ దార్ పాక్ పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా బ్రిటన్ పత్రిక ‘డైలీ టెలిగ్రాఫ్’ పాక్ ఎయిర్ ఫోర్స్ పట్ల ప్రశంసలతో కూడిన కథనం ప్రచురించిందని పార్లమెంట్‌లో పేర్కొన్నారు. కానీ, నిజానికి డైలీ టెలిగ్రాఫ్ అలాంటి హెడ్లైన్ ఉపయోగించలేదని, ఇది సోషల్ మీడియాలో తప్పుడు సమాచారంగా వ్యాప్తి పొందిందని వారు స్పష్టం చేశారు.

పాక్ లోని ప్రముఖ మీడియా సంస్థ డాన్ మీడియా ప్రతినిధులు కూడా ఈ విషయాన్ని పరిశీలించి, ఇషాక్ దార్ ప్రస్తావించిన ‘గగనతల రారాజు పాక్ ఎయిర్ ఫోర్స్’ వంటి హెడ్లైన్ అసలు బయటికి రాలేదని ఖండించారు. డైలీ టెలిగ్రాఫ్ కూడా తాము ఎప్పుడూ అలాంటి ఫిక్స్ చేసిన కథనం ప్రచురించలేదని స్పష్టం చేసింది.

ఈ సంఘటనపై పాక్ నెటిజన్లు ఇషాక్ దార్‌పై తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా విస్తృత చర్చలు సాగిస్తున్నారు. 


Tags:    

Similar News