58 Pak Soldiers Killed: పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో భీకర పోరు..58 పాక్ సైనికులు మృతి
పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్‌ల మధ్య సాయుధ ఘర్షణలు తీవ్రమవుతున్నాయి.
58 Pak Soldiers Killed: పాక్-ఆఫ్ఘన్ సరిహద్దులో భీకర పోరు..58 పాక్ సైనికులు మృతి
Pakistan-Afghanistan Border Clashes Intensify: పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్‌ల మధ్య సాయుధ ఘర్షణలు తీవ్రమవుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో అఫ్ఘనిస్థాన్ దళాలు ముందస్తు హెచ్చరిక లేకుండా దాడులకు పాల్పడ్డాయని, దీనికి ప్రతీకారంగా తాము 19 అఫ్ఘన్ మిలిటరీ పోస్టులను, ఉగ్రవాద శిబిరాలను స్వాధీనం చేసుకున్నామని పాకిస్థాన్ చెప్పింది. దీనికి తాలిబన్ ప్రభుత్వం స్పందిస్తూ, తాము జరిపిన ప్రతీకార దాడుల్లో 58 మంది పాక్ సైనికులు మరణించారని, 30 మంది సైనికులు గాయపడ్డారని తెలిపింది.
ఆదివారం తాము చేసిన ప్రతీకార దాడులు విజయవంతమయ్యాయని ఆ దేశ రక్షణ శాఖ పేర్కొంది. పాక్‌కు దీటుగా బదులిస్తాయని హెచ్చరించింది. ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలోని అంగూర్ అడ్డా, బజౌర్, కుర్రం, దిర్, చిత్రాల్; బలూచిస్థాన్‌లోని బరమ్‌చాలలోని పాకిస్థానీ పోస్టులపై అఫ్ఘన్ దళాలు దాడులు చేశాయి.