పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు.. 5మంది పాక్‌ సైనికులు సహా అఫ్గాన్‌ వైపు 30 మంది మృతి

Pakistan-Afghanistan Border Clashes: పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దులో ఘర్షణలు తిరిగి ప్రారంభమయ్యాయి.

Update: 2025-10-27 06:04 GMT

పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఘర్షణలు.. 5మంది పాక్‌ సైనికులు సహా అఫ్గాన్‌ వైపు 30 మంది మృతి

Pakistan-Afghanistan Border Clashes: పాకిస్తాన్-అఫ్గానిస్తాన్ సరిహద్దులో ఘర్షణలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఖైబర్ పఖ్తుంఖ్వా సమీపంలో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు పాక్ సైనికులు మరణించినట్లు తెలిసింది. అఫ్గాన్ వైపు 25మంది ఉగ్రవాదులు చనిపోయారని పాక్ సైన్యం తెలిపింది. అయితే చనిపోయింది ఉగ్రవాదులా తాలిబన్‌ దళాలా తెలియాల్సి ఉంది. కుర్రం, ఉత్తర వజీరిస్తాన్ జిల్లాల్లో సరిహద్దులను దాటి ఉగ్రవాదులు పాక్‌లోకి ప్రవేశిస్తుండగా దాడులు చేసినట్లు సైన్యం వివరించింది. నలుగురు ఆత్మాహుతి బాంబర్ల సహా 25మంది ఉగ్రవాదులను పాకిస్థాన్ భద్రతా దళాలు కాల్చి చంపినట్లు సైన్యం వివరించింది.

ఉగ్రవాదులతో జరిగిన ఘర్షణల్లో ఐదుగురు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పయినట్లు తెలిపింది. ఈ చొరబాటు ప్రయత్నాలు ఉగ్ర సమస్యను పరిష్కరించాలన్న అఫ్గాన్‌ ప్రభుత్వ ప్రకటనలను సందేహాస్పదంగా మార్చాయని పాక్‌ ఆరోపించింది. శుక్రవారం రాత్రి ఉత్తర వజీరిస్తాన్, కుర్రం జిల్లాల్లో నిర్వహించి సెర్చ్ ఆపరేషన్​లో అఫ్గాన్‌ సరిహద్దుల నుంచి భారీగా పెద్ద మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ దాడులపై అఫ్గానిస్థాన్‌ ఇంకా స్పందించలేదు.

Tags:    

Similar News