ఒమిక్రాన్‌ వేరియంట్‌ వల్ల బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌లు.. బూస్టర్ డోస్ తప్పనిసరి..

Omicron Live Updates: ప్రచండ వేగంతో ప్రపంచ దేశాలను చుట్టుముడుతున్న ఒమిక్రాన్...

Update: 2021-12-20 03:40 GMT

ఒమిక్రాన్‌ వేరియంట్‌ వల్ల బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌లు.. బూస్టర్ డోస్ తప్పనిసరి..

Omicron Live Updates: ఒమిక్రాన్ వేరియంట్ సులభంగా వ్యాపించే గుణమున్న మహమ్మారి అంటున్నారు శాస్త్రవేత్తలు. ప్రచండ వేగంతో ఒమిక్రాన్ ప్రపంచదేశాలను చుట్టుముడుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రయాణాలు చేయడం ఇన్‌ఫెక్షన్‌ ముప్పును మరింత పెంచుతుందని సూచించారు. రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ ఈ వేరియంట్‌తో బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉందని.... తప్పకుండా బూస్టర్‌ డోసు తీసుకోవాలని సూచిస్తున్నారు.

కొవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న అగ్రరాజ్యం అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా హాలీడే సీజన్‌ కావడంతో ప్రజలు విహారయాత్రలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో విస్తృత వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌ వేగాన్ని కట్టడి చేయాలంటే మాస్కులు ధరించడంతో పాటు బూస్టర్‌ డోసు తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఒమిక్రాన్‌ వేరియంట్‌ వల్ల బ్రేక్‌త్రూ ఇన్‌ఫెక్షన్‌లు పెరగడంలో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 90దేశాలకు వ్యాపించిన ఈ వేరియంట్‌.. అమెరికాలో సగానికిపైగా రాష్ట్రాల్లో వెలుగు చూసిందని చెప్పారు అక్కడి శాస్త్రవేత్తలు.

ఇదిలా ఉంటే, విస్తృత వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్‌ తీవ్రత దక్షిణాఫ్రికా, యూరప్‌ దేశాల్లో అధికంగా ఉంది. ఇప్పటికే అక్కడ నిత్యం వేల సంఖ్యలో ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి. అటు అమెరికాలోనూ కొత్త వేరియంట్‌ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. న్యూయార్క్‌లో పాజిటివిటీ రేటు 8 శాతం దాటింది.

Tags:    

Similar News