మహమ్మారిపై విజయం సాధించారు.. శుభాభినందనలు : కిమ్

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు "సందేశం" పంపినట్లు ఉత్తర కొరియా మీడియా కెసిఎన్‌ఎ శుక్రవారం నివేదించింది.

Update: 2020-05-08 05:35 GMT
Kim Jong Un(File photo)

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్.. చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు "సందేశం" పంపినట్లు ఉత్తర కొరియా మీడియా కెసిఎన్‌ఎ శుక్రవారం నివేదించింది. 'మహమ్మారిపై పోరాటంలో విజయం సాధించినందుకు జిన్‌పింగ్‌కు కిమ్‌ శుభాభినందనలు తెలిపారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. సమర్థుడైన జిన్‌పింగ్‌ నాయకత్వంలోని చైనీస్‌ పార్టీ, ప్రజలు వైరస్‌పై పైచేయి సాధించారని కొనియాడారు' అని కిమ్ తన సందేశంలో పేర్కొన్నారని ఆ మీడియా సంస్థ వెల్లడించింది. కిమ్ ఆరోగ్యం గురించి కొద్దిరోజులుగా ఆందోళన నెలకొన్న తరుణంలో ఈ సందేశం పంపడం విశేషం.

కాగా కరోనా మహమ్మారి వ్యాప్తి మొదటిదశలోనే చైనాకు కిమ్ లేఖ రాశారు.. అప్పట్లో మహమ్మారి భారీ నుంచి కోలుకోవడానికి తమకు తోచిన విధంగా సహాయం చేస్తామని చెప్పారు. అయితే ఎటువంటి సహాయం అనేది మాత్రం ఇంతవరకూ వెల్లడికాలేదు. కాగా గత కొంతకాలంగా గుండె సంబంధ వ్యాధులతో బాధపడుతున్న కిమ్.. చికిత్స అనంతరం అజ్ఞాతంలో ఉన్నారు...‌ ఇటీవలే ఆయన బయటకు వచ్చిన విషయం తెలిసిందే. తన సోదరి కిమ్‌ యో‌ జాంగ్‌‌తో కలిసి ఎరువుల ఫ్యాక్టరీకి వచ్చి రిబ్బన్‌ కట్‌ చేశారు.


Tags:    

Similar News