North Korea - Kim Jong Un: ఉత్తరకొరియా అధ్యక్షుడు కీలక ఆదేశాలు

North Korea - Kim Jong Un: గతేడాది తుపానుల కారణంగా దిగజారిన ఉత్తరకొరియా పరిస్థితులు...

Update: 2021-10-29 02:57 GMT

North Korea - Kim Jong Un: ఉత్తరకొరియా అధ్యక్షుడు కీలక ఆదేశాలు

North Korea - Kim Jong Un: ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార కొరతతో అల్లాడుతోంది. కఠినమైన కరోనా ఆంక్షలు, సరిహద్దుల మూసివేత, గతేడాది తుపానుల కారణంగా దేశంలో పరిస్థితులు మరింత దిగజారాయి. దీంతో 2025 వరకు పౌరులంతా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాల్సిందిగా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. ధాన్య ఉత్పత్తి ప్రణాళికను నెరవేర్చడంలో వ్యవసాయ రంగం విఫలమైనందునే... ఈ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడినట్లు కిమ్‌ వ్యాఖ్యానించారు.

కొవిడ్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఉత్తర కొరియా 2020లో చైనాతో ఉన్న సరిహద్దును మూసివేసింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోయింది. మరోవైపు అణ్వాయుధాల కార్యకలాపాలకు వ్యతిరేకంగా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఈ దేశం ఒంటరిగా మారింది. దీంతో పాటు స్థానికంగా తుపాన్లు, వరదలు పంటలను నాశనం చేశాయి. ఫలితంగా ఆహార కొరత మొదలైంది. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించింది.

డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో.. స్థానికంగా నిత్యవసర ధరలు మండిపోతున్నాయి. ఈ ఫుడ్ ఎమర్జెన్సీ 2025 వరకు కొనసాగుతుందని అధికారులు అంటున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ఉత్తర కొరియా, చైనా మధ్య వాణిజ్య కార్యకలాపాలు పునఃప్రారంభమయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువని చెబుతున్నారు. ఇప్పటికే పరిస్థితి అధ్వానంగా మారిందని, రాబోయే చలికాలంలో బతికి ఉంటామో లేదోనంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News