న్యూయార్క్ లో కరోనా విజృంభణ.. ఒక్కరోజే మరణాల సంఖ్య చూస్తే..

అమెరికాలో కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతూ ఉంది కానీ తగ్గుముఖం పట్టడం లేదు.

Update: 2020-04-08 03:07 GMT

అమెరికాలో కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతూ ఉంది కానీ తగ్గుముఖం పట్టడం లేదు. ఒక్క మంగళావారం న్యూయార్క్ రాష్ట్రంలో 731 కొత్త కరోనావైరస్ మరణాలు నమోదయ్యాయి, ఇది వ్యాప్తి చెందుతున్న రోజునుంచి అతిపెద్ద వన్డే జంప్. దీంతో వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్ర మరణాల సంఖ్య ఇప్పుడు 5,489 గా ఉందని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో తెలిపారు.

'మేము కోల్పోయిన 731 మందిలో ప్రతి మరణం వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక కుటుంబం ఉంది, ఒక తల్లి ఉంది, ఒక తండ్రి ఉంది, ఒక సోదరి ఉంది, ఒక సోదరుడు ఉన్నారు. చాలా మంది న్యూయార్క్ వాసులకు ఈ రోజు మళ్ళీ చాలా నొప్పి కలిగించే దుర్వార్త ఇది.' అని క్యూమో స్టేట్ కాపిటల్ వద్ద ఒక సమావేశంలో అన్నారు. ఒక్క న్యూ యార్క్ నగరంలోనే 3,202 మంది మరణించినట్లు నగర ఆరోగ్య అధికారులు మంగళవారం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.

ఇదిలావుంటే అమెరికాలో కరోనా కేసులు నాలు లక్షలు దాటాయి. ఇందులో 12,854 మరణాలు ఉన్నాయి. అలాగే రికవర్ అయిన కేసులు 21,674 ఉన్నాయి. అత్యధికంగా న్యూయార్క్ రాష్ట్రంలో 142,384 కేసులు ఉన్నాయి.

కాగా కరోనావైరస్ ద్వారా వైట్ హౌస్ టాస్క్ ఫోర్స్ ఒక వారం క్రితం వేసిన అంచనా ప్రకారం 100,000 నుండి 240,000 మంది మరణిస్తారని అంచనా వేసింది, కఠినమైన సామాజిక దూర చర్యలను పాటిస్తే ఆ పరిధిలో మరణాలు ఉండవని చెప్పింది. లేదంటే ఈ లెక్క మరింత ఎక్కువకు వెళ్లొచ్చని పేర్కొంది.


Tags:    

Similar News