Balochistan: సొంత దేశాన్ని ప్రకటించుకున్న బలూచిస్థాన్ వాసులు.. పాకిస్థాన్‌కి మంట పెట్టారుగా!
Balochistan: పాకిస్థాన్‌కు బలూచిస్థాన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఓవైపు భారత్‌తో పాక్ యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. తాము పాక్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించామని ప్రకటించుకుంది.
Balochistan: సొంత దేశాన్ని ప్రకటించుకున్న బలూచిస్థాన్ వాసులు.. పాకిస్థాన్‌కి మంట పెట్టారుగా!
Balochistan: పాకిస్థాన్‌కు బలూచిస్థాన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఓవైపు భారత్‌తో పాక్ యుద్ధ వాతావరణం నెలకొన్న వేళ.. తాము పాక్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించామని ప్రకటించుకుంది. తమకు తామే స్వతంత్ర దేశంగా ఏర్పడినట్టు వెల్లడించింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సన్నాహాలు చేస్తున్నామని రాజధాని క్వెట్టాలో కొత్త పార్లమెంట్ భవనం ఫొటోలు జాతీయ చిహ్నం జాతీయ గీతాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తుంది బలూచిస్థాన్.
70 ఏళ్లుగా బలూచిస్తాన్ ప్రజలను పాక్ అణచివేస్తుందంటూ ప్రధాని మోడీకి, ఐక్యరాజ్యసమితికి బలూచ్ వెల్ఫేర్ అసోసియేషన్ లేఖ రాసింది. తమను స్వతంత్ర దేశంగా గుర్తించాలని అందులో పేర్కొంది. భారత్ సహా ఇతర దేశాలు తమ ఎంబసీలు ఏర్పాటు చేసుకోవాలని కోరింది.