Massive Protests in PoK: పాక్‌స్తాన్‌కు వ్యతిరేకంగా పీవోకేలో భారీ ఆందోళన
Massive Protests in PoK: పాక్‌స్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అక్కడి ప్రజలు భారీ ఆందోళనలు చేపట్టారు.
Massive Protests in PoK: పాక్‌స్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో అక్కడి ప్రజలు భారీ ఆందోళనలు చేపట్టారు. షటర్-డౌన్.. వీల్-జామ్ పేరుతో అవామీ యాక్షన్ కమిటీ సమ్మెకు పిలుపునిచ్చింది. పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతున్నట్లు నిరసనకారులు తెలిపారు.
70 ఏళ్లకుపైగా పీవోకేలోని ప్రజలకు ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదని అవామీ కమిటీ నేత షౌకత్ నవాజ్ మీర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పీవోకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని.. తమ 38 డిమాండ్లను అమలుచేయాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనలను మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించింది.