Mark Zuckerberg: కరోనా కట్టడికి జుకర్‌బర్గ్‌ భారీ విరాళం

కరోనా వైరస్‌ పై పోరాటానికి ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్గ్‌ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిస్కిలా చాన్‌ ముందుకు వచ్చారు.

Update: 2020-03-30 02:24 GMT
Mark zuckerberg, Priscilla Chan

కరోనా వైరస్‌ పై పోరాటానికి ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్గ్‌ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిస్కిలా చాన్‌ ముందుకు వచ్చారు.. వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది మరణించడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కరోనా వైరస్ కట్టడికి ప్రతిఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.. తమ వంతు సహాయంగా పరిశోధనలకు గాను 25 మిలియన్‌ డాలర్ల (రూ.187.19 కోట్లు) విరాళం ప్రకటించారు.

ఈ మొత్తాన్ని కరోనా వైరస్ పరిశోధనకు వినియోగించాలని సూచించారు. విరాళాన్ని చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ (CZI) నుంచి అందించారు. ఈ సమయంలో మనకు పరిశోధకులే ముఖ్యమని చెప్పిన జుకర్ బర్గ్ వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని అందరికి పిలుపునిచ్చారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో 6 లక్షల మందికి పైగా మహమ్మారి భారిన పడ్డారు. 30 వేల మందికి పైగా మరణించారు. వైరస్ కు కేంద్రమైన చైనాలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాలో లక్షమందికి పైగా ఈ వైరస్ సోకింది.

Tags:    

Similar News