అమెరికాలో ట్రంప్ భయానికి ముందే సిజేరియన్ చేయించుకుంటున్న ఇండియన్స్

Update: 2025-01-23 07:37 GMT

Birthright citizenship deadline: డోనాల్డ్ ట్రంప్ అమెరికాలో బర్త్ రైట్ సిటిజెన్ షిప్ రద్దు చేస్తూ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ కాపీపై సంతకం చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 20వ తేదీ నుండి ఈ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ అమలులోకి రానుంది. డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రకారం, ఫిబ్రవరి 20 తరువాత అమెరికాలో అమెరికా పౌరసత్వం లేని విదేశీయులకు పుట్టే పిల్లలకు అమెరికా పౌరసత్వం రాదు. ఇప్పటివరకు ఉన్న రూల్ ప్రకారం విదేశీయులకైనా సరే అమెరికాలో పిల్లలు పుడితే, ఆ పిల్లలకు జన్మతః అమెరికా పౌరసత్వం వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. ఆల్రెడీ అమెరికాలో స్థిరపడి, అక్కడి పౌరసత్వం ఉన్న వారికి పుట్టిన పిల్లలకు మాత్రమే ఇకపై పౌరసత్వం వస్తుంది.

ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కొత్త పరిష్కారం వెతుక్కుంటున్న ఇండియన్స్

అమెరికాలో పౌరసత్వం లేని విదేశీయులకు ఎదురైన ఈ కొత్త సమస్యకు చెక్ పెట్టేందుకు వారు కొత్త దారి వెదుక్కుంటున్నారు. అదే సిజేరియన్. అయితే, ఇది అందరికీ సాధ్యపడదు. ఫిబ్రవరి 20వ తేదీకి కాస్త అటు ఇటుగా డెలివరీ డేట్ ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్‌కు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అందుకే ప్రస్తుతం 8వ నెల లేదా 9వ నెలలో ఉన్న గర్భవతులు అక్కడి మెటర్నిటీ క్లీనిక్స్‌లో డాక్టర్స్‌ను కలిసి సిజేరియన్ గురించి సలహా తీసుకుంటున్నారు. సాధ్యమైనంతవరకు బర్త్ రైట్ సిటిజెన్ షిప్ ఆదేశాలు అమలులోకి రాకముందే సిజేరియన్ చేయించుకుననైనా సరే బిడ్డకు జన్మినివ్వాలని భావిస్తున్నారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా కథనం ప్రకారం న్యూజెర్సీలో మెటర్నిటీ క్లీనిక్ రన్ చేస్తోన్న డా ఎస్.డి. రమ అనే డాక్టర్ వద్దకు ఇప్పుడు సి-సెక్షన్ కోసం విదేశీయులు క్యూ కడుతున్నారు. అందులో ఎక్కువగా 8, 9 నెలల గర్భంతో ఉన్న ఇండియన్స్ ఉన్నారు. ఇంకొంతమంది డెలివరీ డేట్ కంటే చాలా ముందే సి-సెక్షన్ చేయించుకునే అవకాశం ఉందా అని కూడా ఆరా తీస్తున్నారు అని డా రమ చెప్పినట్లుగా ఆ వార్తా కథనం వెల్లడించింది.

ఒక మహిళ 7 నెలల గర్భంతో ఉన్నారు. మార్చి నెలలో ఆమెకు డెలివరీ డేట్ ఉంది. కానీ ఫిబ్రవరి 20 లోపే సి-సెక్షన్ చేసి డెలివరీ చేయించాల్సిందిగా ఆమె కోరుతున్నారు. ఆమె వెంట ఆె భర్త కూడా వచ్చారని ఆ డాక్టర్ చెబుతున్నారు

ప్రీటర్మ్ బర్త్ (నెలల నిండకు ముందే డెలివరీ చేయించుకోవడం) సాధ్యమే అయినప్పటికీ... అది గర్భిణీలకు, పుట్టబోయే బిడ్డకు మంచిది కాదని తను వారిని హెచ్చరిస్తున్నట్లు డాక్టర్ చెప్పారు. 9 నెలలు నిండక ముందే సి-సెక్షన్ చేయించుకుంటే పుట్టబోయే బిడ్డలో అవయవాలు పూర్తిగా ఎదగకపోవడం, వారి ఆరోగ్యరీత్యా ఏవైనా సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. 

Tags:    

Similar News