భారత్ లో 90 శాతం ప్రజలను కరోనా ఏమీ చేయలేదు : చైనా నిపుణుడి ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రపంచదేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తుంది. భారత్ లో కరోనా పరిస్థితులుపై చైనాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు జాంగ్ వెన్ హాంగ్ కిలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2020-04-24 14:17 GMT

ప్రపంచదేశాలను కరోనా వైరస్ గడగడలాడిస్తుంది. భారత్ లో కరోనా పరిస్థితులుపై చైనాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు జాంగ్ వెన్ హాంగ్ కిలక వ్యాఖ్యలు చేశారు. తన విద్యార్థులతో వీడియో క్లాసులో మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రజల్లో మానసిక ఇమ్యూనిటీ ఎక్కువ కానీ శారీరక వ్యాధి నిరోధక శక్తి తక్కువ అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా "భారత్ లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరైన ప్రజల్లో ఎవరూ మాస్కులు ధరించకపోవడాన్ని వార్తల్లో చూశాను. వారిలో మానసికంగా ఎంతో దృఢమైన వారో అప్పుడే అర్థమైంది. ఓవైపు అమెరికాలో ఇబ్బడిముబ్బడిగా కరోనా కేసులు పెరిగిపోతున్నా, భారత్ లో అంత తీవ్రత కనిపించడంలేదు. భారత్ లో కరోనా ఇన్ఫెక్షన్ శాతం 10కి మించదు. భారత ప్రజలకు 90 శాతం కొవిడ్ ఏమీచేయలేకపోవచ్చు" అని వివరించారు.

ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 23,077 కాగా.. మరణాల సంఖ్య 718కి పెరిగింది. అమెరికా, యూరప్ దేశాలతో పోల్చితే భారత్ లో కరోనా ప్రమాదకరం కాదని జాంగ్ వెన్ హాంగ్ అభిప్రాయపడ్డారు. 

Tags:    

Similar News