బ్రెజిల్ లో కరోనా విలయతాండవం.. 24 గంటల్లో మరణించిన వారి సంఖ్య చూస్తే..

కరోనావైరస్ మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో 881 మంది మరణించినట్లు బ్రెజిల్ ప్రకటించింది.

Update: 2020-05-13 05:03 GMT

కరోనావైరస్ మహమ్మారి కారణంగా గడిచిన 24 గంటల్లో 881 మంది మరణించినట్లు బ్రెజిల్ ప్రకటించింది.ఇది ఒకరోజులో నమోదైన అత్యధిక మరణాల సంఖ్యగా తెలిపింది. అలాగే జర్మనీని మించిన కేసులను నిర్ధారించింది,

బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం నాటికి కనీసం 12,400 మంది మరణించినట్లు వెల్లడించగా, కేసుల సంఖ్య 177,589 కు చేరుకుందని బ్రెజిల్ స్పష్టం చేసింది, జర్మనీలో కరోనా కేసులు 170,508 గా ఉన్నాయి, అలాగే పాజిటివ్ కేసులలో ఫ్రాన్స్ ను కూడా బ్రెజిల్ దాటేసింది, ఫ్రాన్స్ లో ఇప్పటివరకూ ఒక లక్షా నలభై వేలమంది కరోనా భారిన పడ్డారు.

అయితే బ్రెజిల్లో వ్యాప్తి ఇంకా వేగవంతం అవుతోంది, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం సొంతంగా లాక్ డౌన్ సడలింపులు ఇస్తున్నాయి.. దీనిని బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తీవ్రంగా తప్పుబట్టారు. కాగా ప్రజలనుంచి విపరీతమైన ఒత్తిడి కారణంగా జిమ్‌లు, క్షౌరశాలలకు లాక్‌డౌన్ నుండి మినహాయించారు.


Tags:    

Similar News