మనం 945 రూపాయలిస్తే ఆ దేశంలో 10 వేల నోటు ఇస్తారు...

కరెన్సీ విలువ ఆ దేశంలో చిత్తుకాయితంలా మారిపోయింది. కట్టలు కట్టలుగా నోట్లు మోయలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అక్కడి ప్రభుత్వం 10,000 నోటు కూడా ప్రింట్ చేస్తోంది.

Update: 2024-05-14 07:37 GMT

మనం 945 రూపాయలిస్తే ఆ దేశంలో 10 వేల నోటు ఇస్తారు...

కరెన్సీ విలువ ఆ దేశంలో చిత్తుకాయితంలా మారిపోయింది. కట్టలు కట్టలుగా నోట్లు మోయలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అక్కడి ప్రభుత్వం 10,000 నోటు కూడా ప్రింట్ చేస్తోంది. ఆర్థిక సంక్షోభం మూలంగా అర్జెంటీనాలో అక్కడి కరెన్సీ పెసో విలువ దారుణంగా పడిపోయింది. భారత కరెన్సీలో 95 రూపాయల విలువ ఉన్న వస్తువు కొనాలంటే అక్కడ 1,000 పెసోలు ఇవ్వాలి. అంటే, మనం దాదాపు 950 రూపాయులు ఇస్తే అక్కడ 10,000 నోటు కొనుక్కోవచ్చన్న మాట.

అర్జెంటీనాలో దారుణంగా ద్రవ్యోల్బణం..

అర్జెంటీనాలో దారుణంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం అక్కడి ప్రజల జీవితాలను అస్తవ్యవ్యస్తం చేసింది. ఈ ఏడాది మార్చి నెలలో అర్జెంటీనా ద్రవ్యోల్బణం 287 శాతానికి చేరుకుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచంలో అత్యధిక ద్రవ్యోల్బణం రికార్డయిన అర్జెంటీనాలో ఇప్పడు 10 వేల నోటు కూడా ప్రింట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. భారత కరెన్సీలో దాని విలువ వేయి రూపాయలు కూడా లేదు.

అర్జెంటీనా కరెన్సీపై ప్రభావం చూపిన ద్రవ్యోల్బణం..

ప్రపంచంలో అత్యధిక ద్రవ్యోల్బణం అర్జెంటీనాలో రికార్డైనట్టుగా ఆర్ధిక నిపుణులు వెల్లడిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుదల కారణంగా డాలర్ తో పోలిస్తే అర్జెంటీనా కరెన్సీ పెసో విలువ అట్టడుగుకు పడిపోయింది. గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభం ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది.

10 వేల కరెన్సీ నోట్లు ఎప్పుడు వస్తాయంటే?

జూన్ నెలలో 10 వేల కరెన్సీ నోట్లు అందుబాటులోకి తీసుకువచ్చేలా అధికారులు ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు. సాధారణంగా దేశంలో గరిష్టంగా 1000 పెసోల కరెన్సీని ప్రజలు ఉపయోగిస్తున్నారు.

ద్రవ్యోల్బణం పెరగడానికి ముందు దేశంలో 1000 పెసోల విలువ సుమారు 58 డాలర్ల వరకూ ఉండేది.

ఇప్పుడు 10 వేల నోటు అచ్చు వేస్తున్న అర్జెంటీనా సెంట్రల్ బ్యాంకు.. వచ్చే ఏడాది 20 వేల నోటు విడుదల చేయాలని కూడా భావిస్తోంది.

అర్జెంటీనా అధ్యక్షుడు ఏం చేశాడంటే?

అర్జెంటీనా అధ్యక్షుడిగా జేవియర్ మిలే గత ఏడాది డిసెంబర్‌లో బాధ్యతలు చేపట్టారు. దేశంలో ఆర్ధిక స్థిరత్వం కోసం ప్రయత్నిస్తానని ఆయన ఎన్నికల్లో ప్రజలకు హామీ ఇచ్చారు. అంతకుముందున్న వామపక్ష ప్రభుత్వం అనుసరించిన ఆర్ధిక విధానాలను సమీక్షించనున్నట్టుగా హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాల కారణంగా ద్రవ్యోల్బణం తగ్గుతుందని జేవియర్ చెబుతున్నారు. గత నెలలో ఆయన కీలక వడ్డీ రేట్లను మూడు సార్లు తగ్గించారు. ఆయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది కాలమే చెబుతుంది.

Tags:    

Similar News