Ghazala Hashmi: వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బరిలో హైదరాబాద్‌ మహిళ

Ghazala Hashmi: అమెరికాలో అనేక పదవులకు జరిగిన ఎన్నికలు ప్రత్యేకతను చాటుకున్నాయి.

Update: 2025-11-05 06:08 GMT

Ghazala Hashmi: వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ బరిలో హైదరాబాద్‌ మహిళ

Ghazala Hashmi: అమెరికాలో అనేక పదవులకు జరిగిన ఎన్నికలు ప్రత్యేకతను చాటుకున్నాయి. హైదరాబాద్‌లో జన్మించి అమెరికాకు వలస వెళ్లిన గజాలా హాష్మీ వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి పోటీ పడ్డారు. నాలుగేళ్ల ప్రాయంలో తన తల్లి, సోదరుడితో కలిసి గజాలా అమెరికాలోని జార్జియాకు వెళ్లారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసిన ఆమె తండ్రి ప్రసిద్ధ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు.

చదువుల్లో అద్భుత ప్రతిభ కనబరుస్తూ అనేక స్కాలర్‌షిప్పులు ప్రోత్సాహకాలు అందుకున్న గజాలా.. జార్జియా సదరన్‌ విశ్వవిద్యాలయంలో బీఏ ఆనర్స్‌ చదివారు. అట్లాంటాలోని ఎమరి వర్సిటీ నుంచి సాహిత్యంలో పీహెచ్‌డీ చేశారు. అజహర్‌తో వివాహం అనంతరం గజాలా 1991లో రిచ్‌మండ్‌ ప్రాంతానికి మారారు. 30 ఏళ్ల పాటు ఆమె అక్కడే రేనాల్డ్స్‌ కమ్యూనిటీ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 2019లో ఆమె తొలిసారిగా అమెరికా ఎన్నికల్లో గెలుపొందారు. 2024లో ఆమె సెనేట్‌ విద్య, వైద్య కమిటీ ఛైర్‌పర్సన్‌గా డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఎన్నికయ్యారు.

Tags:    

Similar News