Nobel Prize 2025: హంగేరియన్ రచయితకు.. సాహిత్యంలో నోబెల్ బహుమతి

Nobel prize 2025: సాహిత్యంలో విశేష కృషి చేసిన హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నాహోర్త్కనికి నోబెల్ బహుమతి వరించింది.

Update: 2025-10-10 06:25 GMT

Nobel Prize 2025: హంగేరియన్ రచయితకు.. సాహిత్యంలో నోబెల్ బహుమతి

Nobel prize 2025: సాహిత్యంలో విశేష కృషి చేసిన హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నాహోర్త్కనికి నోబెల్ బహుమతి వరించింది. ఆయన అద్బుతమైన, దార్శనిక రచనలకు గాను ఈ ప్రతిష్టాత్మక బహుమతి లంచినట్టు నోబెల్ కమిటీ ప్రకటించింది. క్రాస్నాహోర్త్కె సెంట్రల్ యూరోపియన్ సంప్రదాయంలో గొప్ప ఇతిహాస రచయితగా ప్రసిద్ది చెందారు. 1954లో హంగేరీలోని గ్యులాలో జన్మించారు. 1985లో సాటాన్టాంగో అనే తొలి నవల ద్వారా ప్రపంచ సాహిత్యంలో సంచలనం సృష్టించారు.

2015లో మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్, 2019లో నేషనల్ బుక్ అవార్డు వంటి అనేక అవార్డులు గెలుచుకున్నారు. క్రాస్నాహోర్త్కె ప్రసిద్ద నవలలైన సాటాన్టాంగో, ది మెలన్కొలి ఆఫ్ రెసిస్టెన్స్ వంటివి చలన చిత్రాలుగా కూడా రూపొందాయి. స్వీడన్ రసాయ శాస్త్రవేత్త అల్ప్రెడ్ నోబెల్ జ్ఞాపకార్దం ఇచ్చేఈ ప్రతిష్టాత్మక బహుమతి కింద విజేతకు 11 మిలియన్ స్వీడిష్ క్రోనోర్ 18 క్యారెట్ల బంగారం పతకం, డిప్లొమో అంద చేయనున్నారు. 

Tags:    

Similar News