కెనడాలో కాల్పులు.. 16 మంది మృతి.. 30ఏళ్ల తరువాత దారుణ ఘటన

కెనడాలో పోలీసు దుస్తులు ధరించి.. ఓ దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు.

Update: 2020-04-20 03:32 GMT

కెనడాలో పోలీసు దుస్తులు ధరించి.. ఓ దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన నోవా స్కోటియాలోని చిన్న పట్టణంలోజరిగింది. వారాంతంలో జరిగిన కాల్పుల సమయంలో ఒక మహిళా పోలీస్ సహా మొత్తం 16 మందిని గుర్తుతెలియని వ్యక్తులు చంపారని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తి స్థాయి దర్యాప్తు చేయకముందే ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వలేమని జాతీయ ప్రధాన కార్యాలయ ప్రతినిధి కేథరీన్ ఫోర్టిన్ సిఎన్‌ఎన్‌కు ఒక ప్రకటనలో తెలిపారు.

అయితే దుండగులు పోలీసుల దుస్తులు ధరించి, కారును కూడా పోలీసుల వాహనం లాగా రూపొందించుకున్నారని అధికారులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న ప్రభుత్వ ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. గత 30 ఏళ్ల కెనడా చరిత్రలో ఇంతటి దారుణ ఘటన జరగడం ఇదే తొలిసారని వారు అభిప్రాయపడ్డారు. చివరి సారి 1989లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 14 మంది చనిపోయారు. దాంతో ఆ ఘటన తరువాత దేశంలో తుపాకుల వాడకంపై అధికారులు కఠినమైన ఆంక్షలు విధించారు.


Tags:    

Similar News