Global Sperm Crisis: నా వీర్యం వాడుకుంటే ఖర్చులు భరిస్తా.. టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Global Sperm Crisis: 37 ఏళ్ల లోపు మహిళలు తన వీర్యాన్ని ఉపయోగించి ఐవీఎఫ్ చేయించుకుంటే ఖర్చులు భరిస్తానని ఆయన ప్రకటించినట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం వెల్లడించింది.
Global Sperm Crisis: నా వీర్యం వాడుకుంటే ఖర్చులు భరిస్తా.. టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Global Sperm Crisis: ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్ దురోవ్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. 37 ఏళ్ల లోపు మహిళలు తన వీర్యాన్ని ఉపయోగించి ఐవీఎఫ్ చేయించుకుంటే ఖర్చులు భరిస్తానని ఆయన ప్రకటించినట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం వెల్లడించింది.
దురోవ్ వీర్యం ప్రస్తుతం రష్యా రాజధాని మాస్కోలోని ఓ ప్రత్యేక క్లినిక్‌లో భద్రపరచి ఉంచారని తెలుస్తోంది. చాలా ఏళ్ల క్రితమే ఆయన కొత్తగా వీర్యదానం చేయడం ఆపేశారని, అప్పట్లో దానం చేసిన నమూనాలనే ఫ్రీజ్ చేసి ఇప్పటికీ వినియోగిస్తున్నారని కథనం పేర్కొంది.
ఈ అంశంపై గతంలో మాట్లాడిన దురోవ్, “ఆరోగ్యకరమైన వీర్యకణాలు దానం చేసే వారు చాలా తక్కువమంది ఉన్నారని ఓ డాక్టర్ నాకు చెప్పారు. అందుకే సంతానం లేని దంపతులకు సహాయం చేయడం సామాజిక బాధ్యతగా భావించి వీర్యదానం చేశాను” అని వెల్లడించారు.
గత 15 ఏళ్లలో తాను చేసిన వీర్యదానంతో ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో సుమారు 100 మంది పిల్లలు జన్మించారని దురోవ్ తెలిపారు. వారికి తన సంపదను పంచుతానని కూడా ఆయన వెల్లడించారు. గత సంబంధాల ద్వారా తనకు ఇప్పటికే ఆరుగురు సంతానం ఉన్నారని చెప్పారు.
ప్రస్తుతం పావెల్ దురోవ్ సంపద విలువ 14 నుంచి 17 బిలియన్ డాలర్ల మధ్యలో ఉందని అంచనా. ఆ సంపదను తన పిల్లలందరికీ సమానంగా పంచుతానని వీలునామాలో పేర్కొన్నట్లు సమాచారం.